Home> జాతీయం
Advertisement

Himanta Biswa Sarma: అస్సాం నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిస్వ శర్మ, కాంగ్రెస్‌ను వీడి బీజేపీకి కోట కట్టిన నేత

Himanta Biswa Sarma, Assam New CM | సర్బానంద సోనోవాల్‌ను కాదనుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు, గువాహటిలో నేడు  జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. హింత బిస్వ శర్మనే తమ నేత అని, కాబోయే సీఎం అని స్పష్టం చేశారు. 

Himanta Biswa Sarma: అస్సాం నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిస్వ శర్మ, కాంగ్రెస్‌ను వీడి బీజేపీకి కోట కట్టిన నేత

Himanta Biswa Sarma : అస్సాం నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిస్వ శర్మను భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నుకున్నారు. సర్బానంద సోనోవాల్‌ను కాదనుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు, గువాహటిలో నేడు  జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. హింత బిస్వ శర్మనే తమ నేత అని, కాబోయే సీఎం అని స్పష్టం చేశారు. 

2016లో నెగ్గిన బీజేపీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. అయితే గత ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా సర్బానంద సోనోవాల్‌(Sarbananda Sonowal)ను ప్రకటించి ఎన్నికలకు వెళ్లిన బీజేపీ(BJP) అధిష్టానం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఎం అభ్యర్థిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అస్సాంలో అసెంబ్లీలో 126 సీట్లుండగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 60 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ మిత్రపక్షాలు 15 స్థానాల్లో విజయం సాధించడంతో వరుసగా రెండో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

Also Read: Koppula Eshwar: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు COVID-19 పాజిటివ్

సీఎం సీటు కోసం హిమంత బిస్వ శర్మ, సర్బానంద సోనోవాల్ పోటీపడగా.. బీజేపీ ఎమ్మెల్యేలు శర్మకు ఓటు వేశారు. గత ప్రభుత్వంలో సోనోవాల్‌ కేబినెట్‌లో బిస్వ శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా చేశారు. హిమంత బిస్వ శర్మ 6ఏళ్ల కిందట కాంగ్రెస్  పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ సత్తాను రెట్టింపు చేసిన నేతగా ఆయనకు పేరుంది. మూడు పర్యాయాలు కాంగ్రెస్ నేత తరుణ్ గోగోయ్ వరుసగా విజయాలు సాధించగా, ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన హిమంత బిస్వ వర్మ(Himanta Biswa Sarma) బీజేపీని విజయపథంలో నడిపించడంలో కీలకపాత్ర పోషించారు.

Also Read: Tata Motors: కార్ల ధరలు పెంచేసిన టాటా మోటార్స్, లేటెస్ట్ రేట్లు ఇవే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More