Home> జాతీయం
Advertisement

విపక్ష పార్టీలను కడిగేసిన ప్రధాని మోదీ

దశాబ్దాల కాలం నాటి రామ్ జన్మభూమి అంశం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం  సంకల్పం, పట్టుదలను సూచిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

విపక్ష పార్టీలను కడిగేసిన ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: దశాబ్దాల కాలం నాటి రామ్ జన్మభూమి అంశం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం  సంకల్పం, పట్టుదలను సూచిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ.. 2014, 2019ల మధ్య దేశ ప్రజలు తమ ప్రభుత్వ పని తీరును చూశారని, మరల 2019లో దేశంలో మరోసారి అద్భుతమైన బహుమతి ఇచ్చారని ప్రధాని మోదీ అన్నారు.

తమ ప్రభుత్వం మీ మార్గంలో కొనసాగి ఉంటే, ఆర్టికల్ 370 రద్దయ్యేది కాదని, ట్రిపుల్ తలాక్ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే వాళ్లము కాదని ఆయన ప్రతిపక్షాలనుద్దేశించి మాట్లాడారు. 

మేము పాలనలో పారదర్శకత వహించామని, కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన అందించామని, గత ప్రభుత్వాల ప్రకారం పనిచేస్తే, రామ్ జన్మభూమి సమస్య పరిష్కారం అయ్యేదికాదని, కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ కల నిజమయ్యేది కాదని, భారతదేశం-బంగ్లాదేశ్ భూ ఒప్పంద అంగీకారం జరిగేది కాదని ప్రధాని మోదీ అన్నారు.
 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More