Home> జాతీయం
Advertisement

Reservations Issue: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దు వ్యవహారం, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

Reservations Issue: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. మూడో దశ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈలోగా రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్‌గా మారి చర్చనీయాంశమవుతోంది. బీజేపీను ఇరుకున పెట్టే విధంగా కొన్ని అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Reservations Issue: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల రద్దు వ్యవహారం, కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

Reservations Issue: తాజాగా రిజర్వేషన్లకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బీజేపీ అదికారంలో వస్తే రిజర్వేషన్లు తొలగిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినట్టుగా వ్యాఖ్యలున్నాయి. ఈ వీడియోపై అమిత్ షా స్పందించారు. బీజేపీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు బీజేపీ తొలగిస్తుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా వీడియో వైరల్ అవుతోంది. అటు ఆర్ఎస్ఎస్ కూడా దీనిపై స్పందించినట్టుగా మరో వీడియో వైరల్ అవుతోంది. దాంతో అప్రమత్తమైన బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దాంతో  రంగంలో దిగిన పోలీసులు ఇది ఫేక్ వీడియోగా, ఎడిట్ చేసిన వీడియోగా తేల్చారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తున్నట్టు గుర్తించారు. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బీజేపీ స్పష్టం చేసింది. ఇదంతా ఫేక్ అని వెల్లడించింది. 

వైరల్ అవుతున్న ఈ వీడియా వాస్తవానికి తెలంగాణలో ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లు తొలగించాలని చేసిన వ్యాఖ్యలకు సంబంధించినది తెలిపింది. ఈ వీడియోను ఎడిట్ చేసి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పినట్టుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపించింది. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికల్నించి తొలగించాలని బీజేపీ కోరింది. 

ఈ ఫేక్ వీడియోపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఏయే ఖాతాల్లో షేర్ చేశారనే అంశంపై దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఎక్స్, ఫేస్‌బుక్‌లకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ తరహా వీడియోలు వ్యాప్తి చేసిన వ్యక్తులు చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. 

Also read: Inheritance Tax: వారసత్వ పన్ను అంటే ఏంటి, ఇండియాలో ఈ ట్యాక్స్ ఉందా లేదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More