Home> జాతీయం
Advertisement

Bipin Rawat killed Timeline: సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదం.. విషాద ప్రయాణం సాగిందిలా

Bipin Rawat Dies In Chopper Crash A Timeline : సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలడం.. ఈ ఘోర ప్రమాదంలో బిపిన్ రావత్ ఆయన భార్య మధులిక మరో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక విషాద ప్రయాణం ఇలా సాగింది.

 Bipin Rawat killed Timeline: సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదం.. విషాద ప్రయాణం సాగిందిలా

Bipin Rawat Helicopter Crash Live Updates Bipin Rawat, Wife Left Delhi at 9am in Spl Aircraft, Mishap at 12.20pm, A Timeline : సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలడం.. ఈ ఘోర ప్రమాదంలో బిపిన్ రావత్ ఆయన భార్య మధులిక మరో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఈ విషాదం జరిగింది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ( IAF Mi-17V5 helicopter) ఆర్మీ హెలికాప్టర్‌ లో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో (Bipin Rawat Helicopter Crash) పాటు మరో 13 మంది ప్రయాణిస్తుండగా..ఈ ఘోరం జరిగింది. 

ఇక విషాద ప్రయాణం సాగిందిలా..

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ వెల్లింగ్టన్‌లో (Wellington) మిలిటరీ కాలేజీలో ఇవాళ లెక్చర్‌ ఇచ్చే కార్యక్రమం ఉంది. దీంతో మొదట.. ఉదయం 9కి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సీడీఎస్ బిపిన్‌ రావత్‌ (CDS Bipin Rawat) పాటు ఆయన భార్య మధులిక రావత్‌, ఆర్మీ ఉన్నతాధికారులు బయల్దేరారు. 

తర్వాత సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ( IAF Mi-17V5 helicopter) ఆర్మీ హెలికాప్టర్‌ లో బిపిన్ రావత్ (Chief of Defence Staff ) ఆయన భార్యతో పాటు మరో 12 మంది ఆర్మీ అధికారులతో కలిసి వెల్లింగ్టన్‌కి బయల్దేరారు. ఉదయం 11:48 నిమిషాలకు ఈ హెలికాప్టర్‌ సూలూరు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి టేకాఫ్‌ అయ్యింది. అయితే నీలగిరి కొండల్లో (Nilgiris) విస్తరించిన దట్టమైన అడవుల మధ్య ప్రయాణించి వెల్లింగ్టన్‌కు ఈ హెలికాప్టర్‌ చేరుకోవాల్సి ఉంది. ఇక సూలూరు (Sulur) నుంచి వెల్లింగ్టన్‌కు ఎక్కువ దూరం కూడా లేదు. 94 కిలోమీటర్ల దూరమే ఉంది. 

Also Read : Bipin Rawat death news: ఆర్మీ హెలీక్యాప్టర్ కూలిన ఘటనలో CDS బిపిన్ రావత్‌ మృతి

అయితే సూలూరు నుంచి బయల్దేరిన హెలికాప్టర్‌ ప్రయాణం మొదట బాగానే సాగింది. గమ్యానికి మరికొద్ది క్షణాల్లో చేరుకుంటామనే సమయంలో హెలికాప్టర్ లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో సిబ్బంది బేస్‌స్టేషన్‌తో కాంటాక్ట్ అయ్యారు. అయితే మధ్యాహ్నం 12.22 ప్రాంతంలో ఎంఐ 17 వీ5 ( IAF Mi-17V5 helicopter) ఆర్మీ హెలికాప్టర్‌కు.. బేస్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. 12:27 సమయంలో హెలికాప్టర్‌ క్రాష్‌ అయినట్లు సమాచారం. 

మరో ఐదు నిమిషాల్లోనే గమ్యస్థానం వెల్లింగ్టన్‌కు చేరుకునే క్రమంలో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి వెల్లింగ్టన్‌ డిఫెన్స్‌ స్టాఫ్ కాలేజీకి 16 కిలోమీటర్ల దూరమే ఉంది. హెలికాప్టర్ శిథిలాలు తమిళనాడులోని నాంచప్ప చత్తరాం కట్టేరీ ప్రాంతంలో లభించాయి.

ప్రమాదంలో ఎంఐ 17 వీ5 ( IAF Mi-17V5 helicopter) ప్రయాణిస్తున్న 13 మంది మరణించారు. ఒక్కరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదస్థలంలో తీవ్రంగా గాయపడిన బిపిన్‌ రావత్‌ను (CDS Bipin Rawat) వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.

Also Read : Know Who is Gen Bipin Rawat : చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ జీవితమంతా ఆర్మీలోనే.. ఎన్నో రికార్డులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More