Home> జాతీయం
Advertisement

Bad news for PUBG lovers: ఇకపై పబ్జీ గేమ్ ఆడలేరు

గాల్వాన్ లోయ (galwan valley) లో చైనా భారత సైనికులపై దురాఘాతానికి పాల్పడిన తర్వాత భారత్ పబ్జీ సహా అనేక యాప్‌ (Apps banned) లను నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సెప్టెంబరులో 116 యాప్‌లపై భారత ప్రభుత్వం (Govt of India) నిషేధం విధించింది. దీంతో పబ్జీ (PUBG) సహా అన్ని యాప్‌ల డౌన్‌లౌడ్ సెప్టెంబరు 2 నుంచి నిలిచిపోయింది.

Bad news for PUBG lovers: ఇకపై పబ్జీ గేమ్ ఆడలేరు

PUBG Mobile, Lite version to stop working in India from today: న్యూఢిల్లీ: గాల్వాన్ లోయ (galwan valley) లో చైనా భారత సైనికులపై దురాఘాతానికి పాల్పడిన తర్వాత భారత్ పబ్జీ సహా అనేక యాప్‌ (Apps banned) లను నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సెప్టెంబరులో 116 యాప్‌లపై భారత ప్రభుత్వం (Govt of India) నిషేధం విధించింది. దీంతో పబ్జీ (PUBG) సహా అన్ని యాప్‌ల డౌన్‌లౌడ్ సెప్టెంబరు 2 నుంచి నిలిచిపోయింది. అయితే నిషేధానికి ముందు ఈ యాప్‌ను డౌన్‌లౌడ్ చేసుకున్న వారికి ఇన్నీ రోజులు పబ్జీ ఆట (PUBG Game) ను ఎంజాయ్ చేసే అవకాశం లభించింది. కానీ ఈ రోజు నుంచి అలాంటి వారు కూడా పబ్జీ ఆట ఆడలేరు. చైనా యాప్‌లను నిషేధించిన రెండునెలల తరువాత.. భారత్‌లో పబ్జీ సర్వర్లను నిలిపివేస్తున్నట్లు పబ్జీ సంస్థ శుక్రవారం ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం (IT Act) సెక్షన్ 69 ఎ కింద ప్రకారం భారత్‌లో పబ్జీ గేమ్‌ను నిషేధించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఐటీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. భారత్‌లో అక్టోబరు 30 నుంచి పబ్జీ మొబైల్  (PUBG Mobile), పబ్జీ మొబైల్ లైట్ (PUBG Mobile Lite ) సేవలను నిలిపివేస్తున్నట్లు టెన్సెంట్ గేమ్స్ (Tencent Games) వెల్లడించింది. యూజర్ల డేటా భద్రతకు తాము అధిక ప్రాధాన్యమిస్తామని.. భారత భద్రతా చట్టాలు.. నిబంధనలను ఎల్పప్పుడు పాటించామని ఆ సంస్థ వెల్లడించింది. రియు భారతదేశంలో తమకు మద్దతు ఇచ్చినందుకు పబ్జీ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ టెన్సెంట్ గేమ్స్ (Tencent) పోస్ట్ చేసింది.    Also read : JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్

ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్లకు పైగా వినియోగదారులు ఈ పబ్జీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. నిత్యం 50 మిలియన్ల మంది యాక్టివ్‌గా ఆటను ఆడతారు. అయితే భారతదేశంలో దాదాపు 33 మిలియన్ల మంది వినియోగదారులు పబ్జీను డౌన్‌లోడ్ చేసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ యాప్‌ను దేశంలో నిషేధించడంతో పబ్జీ సంస్థకు కోట్లాది రూపాలయల నష్టం వాటిల్లింది. 

Also read: BJP workers murder: ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More