Home> జాతీయం
Advertisement

Chennai Floods: చెన్నై వరదలపై డేవిడ్ వార్నర్ ఆందోళన, సహాయం కోసం పిలుపు

Chennai Floods: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను తీరం దాటింది. తీరం దాటే సమయంలో ఏపీలో బీభత్సం సృష్టించింది. మిచౌంగ్ తుపాను ప్రభావంతో అత్యధికంగా నష్టపోయిన చెన్నైపై ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Chennai Floods: చెన్నై వరదలపై డేవిడ్ వార్నర్ ఆందోళన, సహాయం కోసం పిలుపు

Chennai Floods: మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నై సహా పొరుగు జిల్లాల్లో మూడ్రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెన్నై నగరంలో మరోసారి వరద పోటెత్తింది. వరద కారణంగా చెన్నై నగరం అతలాకుతలమైపోయింది. చెన్నై ఎయిర్‌పోర్ట్ సైతం మునిగిందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు..

మిచౌంగ్ తుపాను కారణంగా  చెన్నైను భారీ వర్షాలు ముంచెత్తాయి. మొన్న 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2015 నాటి చెన్నై వరదలు గుర్తొచ్చిన పరిస్థితి. చెన్నైలో లోతట్టు ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, రహదారులు అన్నీ చెరువుల్లా మారిపోయాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం భారీ చెరువును తలపించింది. ఫలితంగా విమానాశ్రయం మూతపడింది. చెన్నై వరద దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. చెన్నై వరదలపై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. సొంత దేశం ఆస్ట్రేలియా తరువాత భారతదేశంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉండటమే కాకుండా ఇక్కడి వారితో అతనికి అనుబంధమెక్కువ. 
ఇప్పుడు చెన్నై వరదలపై డేవిడ్ వార్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు. 

చెన్నై వరద పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన డేవిడ్ వార్నర్ సహాయం అందించాలని పిలుపిచ్చాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వరద పోటెత్తడంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నించాలని కోరారు. ఎవరైనా సహాయం చేసే పరిస్థితిలో ఉంటే తప్పకుంజా సహాయం చేసేందుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. ఒకరికొకరు మద్దతుగా నిలవాల్సిన అవసరముందని, అందరూ కలిసి రావాలని వార్నర్ పోస్ట్ చేశారు.

మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో విలయం కన్పించింది. భారీగా ఆస్థినష్టం సంభవించింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో చాలామంది సర్వస్వం కోల్పోయారు. గత రెండ్రోజుల్లో సైతం 45 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. 

Also read: Revanth Reddy Oath: తెలంగాణ సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం, ఎల్బీ స్డేడియంలో భారీగా ఏర్పాట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More