Home> జాతీయం
Advertisement

బీజేపీ తాలిబన్లను తయారుచేయాలని భావిస్తోంది: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఈ మధ్యకాలంలో అనుమానాల పేరుతో కొన్ని ముఠాలు అమాయకులపై దాడులకు తెగబడుతున్నా.. బీజేపీ సర్కారు చూస్తూ ఊరుకుంటోందని 
ఆమె అభిప్రాయపడ్డారు.

బీజేపీ తాలిబన్లను తయారుచేయాలని భావిస్తోంది: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ఈ మధ్యకాలంలో అనుమానాల పేరుతో కొన్ని ముఠాలు అమాయకులపై దాడులకు తెగబడుతున్నా.. బీజేపీ సర్కారు చూస్తూ ఊరుకుంటోందని  ఆమె అభిప్రాయపడ్డారు. వారి వైఖరి చూస్తుంటే కొందరు జనాలు తాలిబన్ల మాదిరిగా మారుతున్నా.. పట్టించుకొనే ధోరణిని కనబరచడం లేదని ఆమె తెలిపారు. షహీద్ దివస్ సందర్భంగా జరిగిన మెగా ర్యాలీలో భాగంగా ఆమె తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ముఠాలు కొన్ని మతాల పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తున్నాయని అన్నారు. 2019 ఎన్నికలలో బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేసి మరీ గెలుస్తుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తమకు కాంగ్రెస్, సీపీఎంల మద్దతు కూడా అక్కర్లేదని ఆమె అన్నారు. ఇక లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే.. బీజేపీ 150 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమే అని మమతా బెనర్జీ అన్నారు. వీలైతే బీజేపీని ఎదుర్కోవడానికి ఫెడరల్ ఫ్రంట్ ధోరణిలో కూడా వెళ్తామని ఆమె అన్నారు. 

రోజు రోజుకీ బీజేపీకి లోక్ సభలో ఎంపీలు తగ్గే అవకాశం ఉందని.. యూపీతో పాటు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, బీహార్, తమిళనాడులో కూడా బీజేపీ అభ్యర్థులకు ప్రజలే గుణపాఠం నేర్పిస్తారని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. మిడ్నాపూర్‌లో నిర్వహించిన మోదీ బహిరంగ సభలో టెంటు కుప్పకూలిన విషయాన్ని కూడా మమతా బెనర్జీ ప్రస్తావించారు. ఒక టెంట్ కూడా సరిగ్గా వేయడం చేతకాని వారు.. దేశాన్ని ఎలా రక్షిస్తారని ఆమె ప్రశ్నించారు.

Read More