Home> జాతీయం
Advertisement

అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ : మధ్యప్రదేశ్‌లో ఎవరిది పైచేయి ?

అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్

అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ : మధ్యప్రదేశ్‌లో ఎవరిది పైచేయి ?

న్యూఢిల్లీ: నేటి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోలింగ్ ముగియడంతో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినట్టయింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో ఈ ఎన్నికలకు సంబంధించి వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి మొదలైంది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకే మెజార్టీ కట్టబెట్టనున్నట్టు టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. మధ్యప్రదేశ్‌కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే, బీజేపీకి 126, కాంగ్రెస్ పార్టీకి 89, బీఎస్పీకి 6, ఇతరులకు 9 స్థానాలు లభించనున్నట్టు టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ పేర్కొంది. 

ఇక ఇదే మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆజ్ తక్-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరోలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపికి 111, కాంగ్రెస్‌కి 113, బీఎస్పీకి 0, ఇతరులు 6 స్థానాలు గెల్చుకోనున్నట్టు ఆజ్ తక్-యాక్సిస్ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడించింది. బీజేపీకన్నా కాంగ్రెస్ పార్టీకే 2 స్థానాలు అధికంగా రానున్నాయని ఆజ్ తక్-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది.

Read More