Home> జాతీయం
Advertisement

Tarun Gogoi: అస్సాం మాజీ ముఖ్యమంత్రి గొగోయ్ పరిస్థితి విషమం

అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ కురువృద్ధుడు తరుణ్‌ గొగోయ్‌ (Former CM Tarun Gogoi) ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Tarun Gogoi: అస్సాం మాజీ ముఖ్యమంత్రి గొగోయ్ పరిస్థితి విషమం

Assam Former CM Tarun Gogoi's health critical: న్యూఢిల్లీ: అస్సాం (Assam) మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ కురువృద్ధుడు తరుణ్‌ గొగోయ్‌ (Former CM Tarun Gogoi) ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే అంతకుముందు కరోనావైరస్ (Coronavirus) బారినపడిన తరుణ్ గొగోయ్ ప్రస్తుతం మల్టీ-ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నారని గువాహటి వైద్య కళాశాల (GMCH) వైద్యులు శనివారం తెలియజేశారు. ప్రస్తుతం ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అపస్మారక స్థితిలో ఉన్నట్లు  అస్సాం ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు పలువురు వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. Also read: Bollywood Drugs Case: హాస్యనటి భారతీ సింగ్ అరెస్ట్

కరోనా సోకడంతో తరుణ్ గొగోయ్‌ ఆగస్టు 25న ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయన రెండు నెలలపాటు (అక్టోబరు 25) వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన అనంతరం తరుణ్ గొగోయ్ మళ్లీ అనారోగ్యం బారిన పడటంతో.. ఆయన కుమారుడు ఎంపీ గౌరవ్ గొగోయ్ నవంబరు 2న ఆసుపత్రికి తరలించారు. అయితే 48 గంటల వరకు గొగోయ్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు ప్రకటించారు. తరుణ్ గొగోయ్ అస్సాం రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతోపాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 

Also read: Sonu Sood: ఆచార్య సెట్స్‌లో రియల్ హీరో సోనూసూద్‌కు సత్కారం

Avantika Mishra: అవంతిక మిశ్రా బ్యూటిఫుల్ పిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Read More