Home> జాతీయం
Advertisement

Assam Floods: వరద బీభత్సం, వేలాది గ్రామాలు నీట మునక

అస్సోంలో ( Assam )  వరద ( Floods ) బీభత్సం సృష్టిస్తోంది. వేలాది గ్రామాలు నీట మునిగిపోయాయి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలు తరలించారు. వరద బీభత్సపు దృశ్యాలు భయం గొలుపుతున్నాయి.

Assam Floods: వరద బీభత్సం, వేలాది గ్రామాలు నీట మునక

అస్సోంలో ( Assam )  వరద ( Floods ) బీభత్సం సృష్టిస్తోంది. వేలాది గ్రామాలు నీట మునిగిపోయాయి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలు తరలించారు. వరద బీభత్సపు దృశ్యాలు భయం గొలుపుతున్నాయి. ఇప్పటికే లక్షా 45 వేలమందిని 564 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 70 లక్షల మంది వరదకు ప్రభావితమయ్యారని తెలుస్తోంది. ఇప్పటివరకూ 2 వేల 4 వందల గ్రామాలు నీట మునిగాయి. కాజీరంగా నేషనల్ పార్క్ ( Kaziranga National Park ) దాదాపు 80 శాతం జలమయమైంది. 

లఖిమ్ పూర్, సోనిత్ పూర్, ధేమాజి, బిశ్వనాధ్, ఉదాల్ గురి, దారంగ్, నల్బరి, తిన్ సుకియా, గోలాఘాట్, మజూలీ, శివసాగర్, దిబ్రూగర్ తదితర జిల్లాలు తీవ్రంగా ప్రబావితమయ్యాయి. ఇప్పటివరకూ 110 మంది మృత్యువాత పడ్డారు. Also read: Breaking News: హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడుతున్న కొండ చరియలు

భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ( Brahmaputra river floods ) కి వరద వచ్చిపడింది. భారతదేశ దుఖదాయినిగా పేరున్న బ్రహ్మపుత్ర వరద ( Brahmaputra Floods ) తో అస్సాం రాష్ట్రం ( Assam state ) అల్లకల్లోలమైంది. బ్రహ్మపుత్ర నది వరదలతో 1 లక్షా 12 వేల హెక్టార్ల పంటపొలాలు నాశనమయ్యాయి. Also read: Corona Pandemic: సీఎంలకు ప్రధాని మోదీ ఫోన్: జగన్‌కు అభినందనలు

Read More