Home> జాతీయం
Advertisement

Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా.. సంచలన ప్రకటన చేసిన అరవింద్ కేజ్రీవాల్..

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. రెండు రోజులలో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
 

Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా.. సంచలన ప్రకటన చేసిన అరవింద్ కేజ్రీవాల్..

Arvind Kejriwal announces shock resignation as delhi cm: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ షాకింగ్ ప్రకటన చేశారు. తాను.. రెండు రోజుల్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో.. దాదాపు ఆరునెలల తర్వాత బెయిల్ మీద అర్వింద్ కేజ్రీవాల్ తీహార్  జైలు నుంచి విడుదలయ్యారు. ఈక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలను రేకెత్తిస్తున్నాయి. తాను ఎవరికి తలొగ్గనని కూడా తెల్చి చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు. ఢిల్లీ ప్రజలు.. తమ సీఎం నేరం చేసాడో..లేదా .. అనేది వారే చెప్పాలన్నారు.

ప్రజల నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని కూడా వెల్లడించారు. అంతేకాకుండా.. వచ్చే ఏడాది ఫిబ్రవరీలో జరగాల్సిన ఎన్నికలను .. ఈ ఏడాది చివరలో.. మహారాష్ట్రతో పాటు.. ఎన్నికలను నవంబరు నెలలో నిర్వహించాలని కూడా కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. సీఎం పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తానని అన్నారు...  ఢిల్లీ ప్రజలే.. కేజ్రీవాల్ నిజాయితీపరుడా లేక నేరస్థుడా అని దేశ ప్రజలను అడగాలనుకుంటున్నట్లు చెప్పారు. అదే విధంగా.. ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు..  ప్రజల మధ్య ఉంటానన్నారు.  దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయాలు హీట్ ను పెంచాయని చెప్పావచ్చు.

ఇదిలా  ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ,ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.   గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజగా,  ఢిల్లీలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ..కేజ్రీవాల్ నిజాయితీపరుడు అని మీకు అనిపిస్తే, మీరు అనుకుంటే నాకు అనుకూలంగా ఓటు వేయండి నేను నేరస్థుడిని కాబట్టి నా మాట వినవద్దని కూడా బహిరంగా ప్రకటన చేశారు. అదే విధంగా..  ప్రజల ఆశీస్సులతో బీజేపీ కుట్రలన్నింటిని ఎదుర్కొనే శక్తి ఆప్ కు ఉందంటూ కూడా అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు.

తమపార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ అనేక కుట్రలు చేసిందని కేజ్రీవాల్ అన్నారు. అందుకే ప్రజల కోసం. జైలు నుంచి పాలన సాగించామన్నారు. సుప్రీంకోర్టు సైతం.. తమపాలనను సమర్ధించిందని కేజ్రీవాల్ అన్నారు.తనను జైలులో పెట్టి ఎన్నికుట్రలు చేసినకూడా భరించానన్నారు . కానీ బీజేపీ ముందు మాత్రం తలొగ్గే ప్రసక్తిలేదని వెల్లడించారు.
 

మనం నిజాయితీపరులం.. కాబట్టి ఈరోజు ఢిల్లీకి మనం ఎంతో చేయగల్గుతున్నామన్నారు. కేంద్రం .. ఈరోజు మన నిజాయీతీని చూసి భయపడిపోతున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అక్రమంగా జైలులో నిర్బంధించారంటూ కూడా చెప్పుకొచ్చారు. "డబ్బు ఉన్నవాళ్లకే అధికారం, అధికారం ఉన్న వాళ్లకు డబ్బులు.. అనే ఈ గేమ్‌లో భాగం కావడానికి రాజకీయాల్లో రాలేదని కేజ్రీవాల్ అన్నారు.

Read more: Radhika merchant: మామతో గొడవకు దిగిన రాధిక మర్చంట్.?.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..

రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఇటీవల .. న్యాయస్థానం నుంచి నాకు బెయిల్ రావడం అనే న్యాయం జరిగిందని,  ఇప్పుడు ప్రజా క్షేత్రంలో కూడా..తనకు న్యాయస్థానం న్యాయం కావాలని కేజ్రీవాల్ అన్నారు. ఇదిలా ఉండగా.. సీఎం కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో ఆప్ నేతల్లో, దేశ రాజకీయాల్లోఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?.. అనే విషయంలో పెద్ద చర్చ కొనసాగుతుందంట. మరోవైపు సీఎం సీటుపై.. మనీష్ సిసోడియా కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More