Home> జాతీయం
Advertisement

Rain Alert: ఉపరితల ఆవర్తనం ప్రభావం, తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Rain Alert For Telugu States: మరి కొద్దిరోజుల్లో వేసవి ప్రారంభం కానుంది. అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవి అత్యంత తీవ్రంగా ఉండనుందనే హెచ్చరికల నేపధ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

Rain Alert: ఉపరితల ఆవర్తనం ప్రభావం, తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

Rain Alert For Telugu States: ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే ఎండలు మండుతున్నాయి. ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ నుంచి కూల్‌న్యూస్ అందుతోంది. రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది.

ఏపీ, తెలంగాణలో ఇప్పటికే ఎండలు తీవ్రమౌతున్నాయి. మార్చ్ నుంచి ఎండలు మరింత పెరగనున్నాయి. అన్నింటికి మించి ఈ ఏడాది వేసవి తీవ్రస్థాయిలో ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో రానున్న రెండ్రోజులు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై ఆవహించిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని ఐఎండీ వివరించింది. అటు దక్షిణ తెలంగాణ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉంది. మరో ద్రోణి దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ రాయలసీమ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఎండలు కూడా తీవ్రంగానే ఉండవచ్చని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. మరోవైపు తెలంగాణలో సైతం రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

Also read: Modi: నీ మొగుడితో గొడవ జరిగితే మాత్రం మోదీ పేరు చెప్పొద్దు.. మహిళలతో ప్రధాని జోకులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More