Home> జాతీయం
Advertisement

AP Telangana Weather Forecast: ఏపీ, తెలంగాణలో రానున్న 4-5 రోజులు వర్షాలు లేనట్టే

AP Telangana Weather Forecast: మొన్నటి వరకూ భారీ వర్షాలు ఇప్పుడు తీవ్రమైన ఉక్కపోతతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలకమైన అప్‌డేట్స్ జారీ చేసింది. మరో 3-4 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆశించని వర్షాలు ఉండవని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

AP Telangana Weather Forecast: ఏపీ, తెలంగాణలో రానున్న 4-5 రోజులు వర్షాలు లేనట్టే

AP Telangana Weather Forecast: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం కారణంగా మొన్నటి వరకూ ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. దిగువ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమ, వాయవ్య దిశల్లో తెలంగాణవైపుకు వీస్తున్నాయి. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.  మొన్నటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రత 34-36 డిగ్రీల వరకు ఉంటోంది. ఇవాశ, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అంతకుమించి భారీ వర్షాలు కురిసే అవకాశాల్లేవు.  పగటి ఉష్ణోగ్రతలు యధావిధిగా 30 డిగ్రీలు దాటి ఉండవచ్చు. 

రాయలసీమ ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉంటుంది. వర్షసూచన లేదు. ఇక కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అక్కడక్కడా తేలికపాటి వర్షపాతం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో వాతావరణంలో హ్యుమిడిటీ ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట వాతావరణంలో కూడా హ్యుమిడిటీ ఉండవచ్చు. అంటే రానున్న 4-5 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు లేనట్టే. 

Also read: VIVO X200 Pro launch: 16GB Ram,9400 డైమెన్సిటీతో వివో నుంచి కొత్త ఫోన్ VIVO X200 Pro

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More