Home> జాతీయం
Advertisement

Vishnu Idol: కృష్ణా నదిలో ప్రత్యక్షమైన విగ్రహాలు.. అయోధ్య రాముడి రూపంలో శ్రీమహావిష్ణువు, శివలింగం

Ancient Idols Found In River: తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో శ్రీ మహావిష్ణువు, శివలింగం బయల్పడింది. విష్ణువు విగ్రహం అచ్చం అయోధ్యలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహ రూపంలో ఉండడం విశేషం. దీంతో ఒక్కసారిగా ఆ విగ్రహ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Vishnu Idol: కృష్ణా నదిలో ప్రత్యక్షమైన విగ్రహాలు.. అయోధ్య రాముడి రూపంలో శ్రీమహావిష్ణువు, శివలింగం

Ancient Idols Found in Krishna River: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణా నదిలో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం పనులు చేపడుతుండగా నదిలో విగ్రహాల జాడ కనిపించింది. అలానే తవ్వుతుండగా శ్రీ మహా విష్ణువు నిలువెత్తు విగ్రహం, ఒక శివలింగం ప్రత్యక్షమైంది. అధికారుల ఆదేశాలతో అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టిన కార్మికులు విగ్రహాలు దెబ్బతినకుండా బయటకు తీశారు. వాటిలో శ్రీమహావిష్ణువు విగ్రహం పరిశీలించగా ఇటీవల అయోధ్య ఆలయంలో ప్రతిష్టించిన రామ్‌ లల్లా విగ్రహం మాదిరి ఉంది. ఈ వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వ్యాపించింది.

Also Read: Bharath Rice: రేపటి నుంచే 'భారత్‌ రైస్‌'.. రూ.29కే బియ్యం ఎక్కడ తీసుకోవాలో తెలుసా?

కర్ణాటకలోని రాయిచూర్‌ జిల్లా దేవసుగుర్‌ గ్రామ సమీపంలో కృష్ణ వంతెన పనులు జరుగుతున్నాయి. నదిలో పనులు చేపడుతుండగా బయట పడిన విగ్రహాలు శతాబ్దాల చరిత్ర కలవని తెలుస్తోంది. శ్రీమహా విష్ణువు అనేక ప్రత్యేకతలతో కూడి ఉంది. నాలుగు చేతులతో మహా విష్ణువు నిలబడిన ఆకారంలో ఉన్నారు. పై చేతుల్లో శంఖు చక్రాలు, మరో రెండు చేతుల్లో కటి హస్త, వరద హస్త ఉన్నాయి. విష్ణువు చుట్టూ దశావతారాలు ఉన్నాయి. మత్య్స, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి దశావతారాలు విగ్రహంపై ఉన్నాయి. వేంకటేశ్వరుడి రూపంలో ఈ విగ్రహం పోలి ఉండడం మరింత ఆసక్తికరంగా ఉంది. అయితే విష్ణువు ప్రతి విగ్రహంలో ఉండే గరుడుడు ఈ విగ్రహంలో లేకపోవడం విశేషం. అలంకార ప్రియుడైన విష్ణువు కావడంతో ఈ విగ్రహంపై పూలమాలలు కూడా ఉండడం విశేషం.

Also Read: UBI Recruitment: అదిరిపోయే ఉద్యోగం.. ఈ జాబ్‌కు ఎంపికైతే తొలి జీతమే రూ.90 వేలు

శతాబ్దాల చరిత్ర
ఈ విగ్రహాలను రాయిచూర్‌ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్‌ పద్మజా దేశాయ్‌ పరిశీలించారు. 'ఈ విగ్రహం అనేక ప్రత్యేకతలతో కూడి ఉంది. విష్ణువు చుట్టూ దశావతారాలు ఉన్నాయి. ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా చెక్కి ఉంటారు. నిలబడి ఉండడంతో ఆగమశాస్త్రం ప్రకారం చెక్కి ఉంటారు. చాలా అందంగా విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహాన్ని పరిశీలిస్తుంటే శతాబ్దాల చరిత్ర ఉంటుందని తెలుస్తోంది. మరింత పరిశోధనలు చేయాల్సి ఉంది' అని డాక్టర్‌ పద్మజా దేశాయ్‌ తెలిపారు.

కాకతీయులు, విజయనగర కాలానివా?
ఈ విగ్రహాలు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినవని తెలుస్తోంది. రాయిచూర్‌ ప్రాంతంలో శ్రీకృష్ణ దేవరాయల పాలనలో ఉండేది. కృష్ణ దేవరాయలు వైష్ణవ మతాన్ని ఆరాధించేవారు. ఈక్రమంలోనే ఆ విగ్రహం చెక్కి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇక శివలింగం అయితే కాకతీయుల కాలానికి సంబంధఙంచినది చరిత్రకారులు భావిస్తున్నారు. కాకతీయుల పరిపాలనలో రాయిచూర్‌ ప్రాంతం ఉంది. కాకతీయుల ఆరాధ్య దేవుడు పరమశివుడు. వాళ్లు అనేక శైవాలయాలు నిర్మించిన విషయం తెలిసిందే. ఇక్కడ బయటపడ్డ విగ్రహం కాకతీయులది అని చెబుతున్నారు. శతాబ్దాల కాలం నాటి ఈ విగ్రహాలు మారిన వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలతో నదిలో పూడుకుపోయి ఉంటాయని విశ్లేషిస్తున్నారు. విగ్రహాలను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించి మరింత అధ్యయనం చేసే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More