Home> జాతీయం
Advertisement

Mizoram Speaker: యాంకర్‌ నుంచి స్పీకర్‌గా.. మిజోరాంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

Baryl Vanneihsangi: ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారి మహిళా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆమె యాంకర్‌ నుంచి స్పీకర్‌గా ఎన్నికవడం గమనార్హం.

Mizoram Speaker: యాంకర్‌ నుంచి స్పీకర్‌గా.. మిజోరాంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

Anchor Becomes Speaker: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అద్భుతం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 40 మంది సభ్యులున్న మిజోరాం రాష్ట్ర అసెంబ్లీకి మొదటిసారిగా మహిళ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఆమె పేరు బారిల్‌ వన్నెహసాంగి. జోరెమ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ నాయకురాలు బారిల్‌ గతంలో యాంకర్‌గా పని చేశారు. ఇప్పుడు ఆమె మిజోరాం స్పీకర్‌గా ఎన్నుకున్నారు. మార్చి 7వ తేదీన సమావేశంలో బారిల్‌ను స్పీకర్‌గా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నుకుంది.

Also Readd: KN Rajannna: జై పాకిస్థాన్‌ అనే కొడుకుల్ని కాల్చి చంపాలి: మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఐజ్వాల్‌ నియోజకవర్గం నుంచి జోరెమ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పీఎం) పార్టీ తరఫున యాంకర్‌ బారిల్‌ వన్నెసాంగీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయసు గల ఎమ్మెల్యేగా బారిల్‌ రికార్డు నెలకొల్పారు. ఆమె వయసు 32 ఏళ్లు. రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందు బారిల్‌ ఐజ్వాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పని చేశారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ హిల్‌ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. అంతకుముందు ఆమె ఓ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పని చేశారు. ఆమె కొన్నాళ్లు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెర్స్‌గా మారారు.

Also Read: Employment News: కేవలం రూ.25 చెల్లిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం

రాష్ట్ర తొలి మహిళ స్పీకర్‌గా బారిల్‌ వన్నెసాంగీ ఎన్నికవడంతో జోరెమ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ అగ్ర నాయకుడు, ముఖ్యమంత్రి లాల్దుహోమా స్పందించారు. 'మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఈ మైలురాయి ఒక ప్రేరణగా నిలుస్తుంది. మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం చూపుతుంది' అని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More