Home> జాతీయం
Advertisement

Amithsha Book On Modi: దేశానికి మరో 25 ఏళ్లు మోడీనే ప్రధాని.. అమిత్ షా పుస్తకంలో అన్ని సంచలనాలే..!

Dreams Meet Delivery: దేశ ప్రధానిగా గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నారు నరేంద్ర దాస్ మోడీ. ఆయన సారథ్యంలోనే హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీనే మరోసారి ప్రధానమంత్రి పగ్గాలు చేపడుతారనే చర్చ సాగుతోంది.తాజాగా ప్రధానమంత్రి పదవి గురించి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Amithsha Book On Modi: దేశానికి మరో 25 ఏళ్లు మోడీనే ప్రధాని.. అమిత్ షా పుస్తకంలో అన్ని సంచలనాలే..!

Modi @ 20:Dreams Meet Delivery: దేశ ప్రధానిగా గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నారు నరేంద్ర దాస్ మోడీ. ఆయన సారథ్యంలోనే హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీనే మరోసారి ప్రధానమంత్రి పగ్గాలు చేపడుతారనే చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రధానిగా కొత్త వ్యక్తి రావచ్చనే చర్చ కూడా ఢిల్లీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కొన్ని రైట్ వింగ్ సంఘాల నుంచే ఈ అభిప్రాయం వస్తోంది. మోడీకి వారసుడిగా కొందరి పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా ప్రధానమంత్రి పదవి గురించి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాన వ్యూహకర్తగా ఉన్న అమిత్ షా.. ప్రధాని పదవిపై చేసిన కామెంట్లు దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా మారాయి.

ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు అమిత్ షా. గుజరాత్ చెందిన మోడీ- షా జోడీని గెలుపు గుర్రాలుగా చెబుతుంటారు.  అమిత్ షా తనకు ఇష్టమైన నేతైన నరేంద్ర మోడీపై తాజాగా పుస్తకం రాశారు. మోడీపై గతంలో తాను రాసిన వ్యాసాలను అందులో  పొందు పరిచారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానిగా గత 20 ఏళ్లుగా చేస్తున్న సేవలను అందులో వివరించారు. అమిత్ షా రాసిన Modi @ 20:Dreams Meet Delivery పుస్తకావిష్కరణ ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. నరేంద్ర మోడీపై ఆసక్తికర కామెంట్లు చేశారు. దేశానికి మరో 25 సంవత్సరాలు నరేంద్ర మోడీనే ప్రధానమంత్రిగా ఉంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలనలో దేశం పురోగమిస్తుందని చెప్పారు అమిత్ షా. దేశ ప్రజలు కూడా ఆయనపై పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు.

ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండానే నరేంద్ర మోడీ బలమైన నేతగా ఎదిగారని అమిత్ షా అన్నారు. మోడీ సారథ్యంలో బీజేపీ దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నారు. బీజేపీని ఉత్తరభారత పార్టీగా, హిందీ మాట్లేడేవారి పార్టీగా చిత్రకరించాలని కొన్ని శక్తులు చేసిన కుట్రలను మోడీ సమర్ధంగా తిప్పికొట్టారని అమిత్ షా వెల్లడించారు. బీజేపీ రైతులకు వ్యతిరేకమనే భావనను... తన పథకాలు, విధానాలతో మోడీ అధిగమించారని తెలిపారు. ఓటు బ్యాంక్ రాజకీయం కాకుండా ప్రజల మేలు కోసమే ప్రధాని మోడీ నిర్ణయాలు తీసుకున్నారని షా చెప్పారు. ప్రజల నమ్మకాన్ని చూడగొన్నారు కాబట్టే.. 2019లో మోడీకి బంపర్ మెజార్టీ వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అదే సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు అమిత్ షా. రాబోయే 25 ఏళ్లు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని ఉంటారని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని సమర్ధంగా నడిపించడంతో పాటు పార్టీ కోసం మోడీ ఎంతో శ్రమించారని అమిత్ షా కొనియాడారు. మోడీ పని తీరు వల్లే బీజేపీ ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందని తెలిపారు.

ప్రధాని మోడీపై అమిత్ షా రాసిన పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ రూపొందించింది. మోడీపై గతంలో అమిత్ షా రాసిన వ్యాసాలతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సుధామూర్తి, నందన్ నిలేకని, అర్వింద్ పనగారియా , విదేశాంగ మంత్రి జైశంకర్, సింగర్ లతా మంగేష్కర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వంటి వాళ్లు.. ప్రధాని నరేంద్ర మోడీపై  రాసిన వ్యాసాలను కూడా ఈ పుస్తకంలో జత చేశారు.

READ ALSO: Uttarakhand Cm in ByPoll: ధామి కోసం ఉత్తరాఖండ్‌కు యోగి ఆదిత్యనాథ్.. రంగంలోకి 40 మంది

READ ALSO: Telangana Diagnostic Centers: ప్రభుత్వ వైద్యులకు మంత్రి హరీశ్‌ రావు వార్నింగ్‌, మందుల చిటీ బయటకు వెళ్తే ఉద్యోగం ఉండదు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More