Home> జాతీయం
Advertisement

Amit Shah: సీఏఏపై కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా (Amit Shah) ప్రకటించారు.

Amit Shah: సీఏఏపై కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

Amit Shah Comments on CAA: న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైన వెంటనే సీఏఏ అమలును పరిశీలిస్తామని అమిత్ షా ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా పౌరసత్వ చట్టానికి (CAA) సంబంధించిన నియమనిబంధనలు ఇంకా రూపొందించలేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ (coronavirus vaccine) ప్రారంభించిన తర్వాత సీఏఏ ( Citizenship Amendment Act ) అమలుపై ఓ నిర్ణయానికి వస్తామని అమిత్ షా స్పష్టంచేశారు. Also read: Bullet train: ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ చూశారా

త్వరలో పశ్చిమ బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ (BJP) నేతలు ఆ రాష్ట్రంలో వరుసగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ నడ్డా (JP Nadda) కాన్వాయ్‌పై జరిగిన దాడి తర్వాత హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ముఖ్యమంత్రి  బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) పై తీవ్ర వాఖ్యలు చేశారు. ఈఘటనకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి బీజేపీకే పరిమితం కాదని.. ఇది పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. 

చొరబాటు దారులను మమతా బెనర్జీ  ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే వారిపై చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఘోరంగా విఫలం అయిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ తమ అభిప్రాయాలను వినిపించే హక్కు ఉందని అమిత్ షా పేర్కొన్నారు. టీఎంసీ నియంతృత్వ విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. 

Also read: Amit shah: ఇలాంటి రోడ్ షో ఎన్నడూ చూడలేదు : అమిత్ షా​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More