Home> జాతీయం
Advertisement

Amit Shah on Jharkhand Assembly election results 2019 : ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా స్పందన

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా.. ఓవైపు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటూనే మరోవైపు ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్, అయోధ్య స్థల వివాదం, అయోధ్య స్థలంలో నాలుగు నెలల్లోనే రామ మందిర నిర్మాణం వంటి కీలకమైన అంశాలపై కీలక ప్రకటనలు చేశారు.

Amit Shah on Jharkhand Assembly election results 2019 : ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా స్పందన

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఝార్ఖండ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. గత ఐదేళ్లపాటు ఝార్ఖండ్‌ను పరిపాలించేందుకు అవకాశం ఇచ్చినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన అమిత్ షా.. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది అని స్పష్టంచేశారు. ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్టు అమిత్ షా ట్విటర్‌లో పేర్కొన్నారు. Read also : ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధాని మోదీ

fallbacks

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా.. ఓవైపు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటూనే మరోవైపు ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్, అయోధ్య స్థల వివాదం, అయోధ్య స్థలంలో నాలుగు నెలల్లోనే రామ మందిర నిర్మాణం వంటి కీలకమైన అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. ఆయా అంశాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయే తప్ప వాటితో దేశానికి కానీ లేదా దేశ పౌరులకు కలిగే నష్టం ఏమీ లేదని వివరించారు. ఆయా చట్టాలను తీసుకురావడంలో బీజేపి ఆంతర్యం ఏంటి ? దేశానికి కలిగే ప్రయోజనాలేంటని అక్కడి ఓటర్లకు వివరించారు. అయినప్పటికీ ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఆ పార్టీకి ప్రతికూలమైన తీర్పే ఇవ్వడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు లైవ్ టీవీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. Watch Zee Hindustan Telugu live TV here

Read More