Home> జాతీయం
Advertisement

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ స్పెషల్ సేల్: స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రత్యేక సేల్: స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ స్పెషల్ సేల్: స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ఫెస్టివల్ సీజన్‌తో కస్టమర్ల ముందుకు వస్తున్నాయి.  అక్టోబరు 10 నుంచి 14 వరకు ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ 'తో, అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్'తో అక్టోబర్ 10 నుంచి 15 వరకు కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్‌లో భాగంగా కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచనుంది. అంతేకాక వివిధ వస్తువులపై డిస్కౌంట్‌లను, తక్కువ ధరలకే వస్తువులను అందించనుంది.

ఫ్లిప్‌కార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, మైక్రో వేవ్స్, కిచెన్ వస్తువులు, దుస్తులు, ఫుట్‌వేర్స్, వాచీలు, బ్యాగ్స్, బ్యాకప్స్, ఆభరణాలు, ఫర్నీచర్స్, బుక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్ వస్తువులపై అక్టోబర్ 10 నుంచి సేల్‌ను ప్రారంభించనుంది. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్‌‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పవర్ బ్యాంక్స్, ఆడియో వస్తువులు, ఫీచర్ ఫోన్లు తదితర వస్తువులపై అక్టోబర్ 11 నుంచి సేల్‌ను ప్రారంభిస్తుంది. మాస్టర్ కార్డ్స్ మీద రాయితీతో పాటు హెచ్‌డీ‌ఎఫ్‌సీ  డెబిట్, క్రెడిట్ కార్డు మీద 10% డిస్కౌంట్ అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఆఫర్లు..

  • స్మార్ట్ ఫోన్స్: రూ.4,999 నుండి ప్రారంభం
  • ఫ్యాషన్: 90% వరకు ఆఫర్
  • టీవీలు: 80% వరకు ఆఫర్
  • హోమ్ అండ్ ఫర్నీచర్: 50-90 శాతం ఆఫర్
  • బ్యూటీ, స్పోర్ట్స్, టాయ్స్: 50-90 శాతం ఆఫర్  
  • స్మార్ట్ ఫోన్లపై: 80 శాతం వరకు ఆఫర్
  • గ్యాజెట్లు, ఇతర పరికరాలు: 80 శాతం వరకు ఆఫర్

తగ్గింపు వివరాలు ఇలా..

  • ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్1 (3GB, 32GB): రూ.9,999వద్ద లభించనుంది.
  • ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్1 (6GB): రూ.12,999వద్ద లభించనుంది.
  • ఆసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్1 (4GB RAM): రూ.10,999వద్ద లభించనుంది.
  • ఆసూస్ జెన్ ఫోన్  5జెడ్: రూ.24,999 వద్ద లభించనుంది.
  • రియల్ మీ సీ1:రూ.6999 వద్ద లభించనుంది.
  • ఇన్ఫినిక్స్ స్మార్ట్2: రూ.4999 వద్ద లభించనుంది.
  • పానసోనిక్ పి91: రూ.2999 వద్ద లభించనుంది.
  • ఒప్పో ఎఫ్ 9: రూ.4199 వద్ద లభించనుంది.
  • ఒప్పో ఏ71: రూ.6990 వద్ద లభించనుంది.
  • హానర్ 7ఎస్: రూ. 6499 వద్ద లభించనుంది.
  • హానర్‌ 9ఎన్‌: రూ 7999 వద్ద లభించనుంది.
  • హానర్‌ 8 ప్రో: 19,999వద్ద లభించనుంది
  • హానర్‌ 9ఐ: 12,999 వద్ద లభించనుంది
  • హానర్‌ 9 లైట్‌: రూ 11,999 వద్ద లభించనుంది
  • హానర్‌ 10: 24,999 వద్ద లభించనుంది
  • గెలాక్సీ ఎస్‌8 (64 జీబీ): రూ.29,990 వద్ద లభించనుంది.
  • గెలాక్సీ ఆన్6 (64 బీజీ):  రూ. 11,990 వద్ద లభించనుంది.  
  • గెలాక్సీ జే3 ప్రొ: రూ.6,190 వద్ద లభించనుంది.
  • గెలాక్సీ ఆన్ మ్యాక్స్ (64 జీబీ): రూ.11,990 వద్ద లభించనుంది.
  • గెలాక్సీ ఆన్ మ్యాక్స్, గెలాక్సీఆన్ నెక్ట్స్ (64 జీబీ): రూ.23,990వద్ద లభించనుంది.

అమెజాన్ అందిస్తున్న ఆఫర్లు..

అమెజాన్‌ ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డు హోల్డర్స్‌కు 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందించనుంది. 'అమెజాన్ ప్రైమ్‌' మెంబర్లకు ఈ సేల్‌ కాస్త ముందుగానే అందుబాటులోకి వస్తుంది.

  • అమెజాన్‌ ఆఫర్‌లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, హోమ్‌, కిచెన్‌ ఉత్పత్తులు, ఫ్యాషన్‌, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై ఆఫర్లను అందించనుంది.
  • ఫ్యాషన్: 50-80% వరకు ఆఫర్
  • హోమ్ అండ్ కిచెన్: 50శాతం వరకు ఆఫర్+ఇతర రాయితీలు
  • అమెజాన్ డివైజెస్: రూ.3,500 వరకు ఆఫర్
  • బుక్స్, ఎంటర్ టైన్ మెంట్: 50శాతం వరకు ఆఫర్+ఇతర రాయితీలు

 

Read More