Home> జాతీయం
Advertisement

అమర్‌నాథ్ యాత్రికులు మా అతిథులు: ఉగ్రవాది

అమర్‌నాథ్ యాత్రికులు తమ లక్ష్యం కాదని.. వారు తమ అతిథులని పాకిస్థాన్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూ వెల్లడించాడు.

అమర్‌నాథ్ యాత్రికులు మా అతిథులు: ఉగ్రవాది

అమర్‌నాథ్ యాత్రికులు తమ లక్ష్యం కాదని.. వారు తమ అతిథులని పాకిస్థాన్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకూ వెల్లడించాడు. తమ సంస్థ యాత్రికులపై కుట్రలు పన్నేందుకు ప్రయత్నిస్తోందన్న వార్తల్లో నిజం లేదని అన్నాడు. తాము తుపాకీ పట్టే పరిస్థితిని తీసుకొచ్చిన వారిపైనే తమ యుద్ధమని, తాము భారత దేశంపై యుద్ధం చేస్తున్నామని, భారత ప్రజలపై కాదన్నారు.

కమాండర్ రియాజ్ నైకూ పేరిట విడుదల చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మైరింది. ‘‘అమర్‌నాథ్ యాత్ర మా లక్ష్యం కానేకాదు. వాళ్లు (యాత్రికులు) తమ మతపరమైన నమ్మకాలతో ఇక్కడికి వస్తున్నారు. వాళ్లు మాకు అతిథులు..’’ అని నైకూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. అయితే ఈ వీడియో నిజమైనదా, నకిలీదా అన్నదానిపై అధికారిక సమాచారం లేదు.

ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర

జమ్మూ బేస్ క్యాంపు నుంచి ఇవాళ అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్రకుల తొలి బ్యాచ్ బయలుదేరింది.  'తొలి బ్యాచ్‌లో 1901 మంది భక్తులు భగవతి నగర్‌ యాత్రి నివాస్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. 52 వాహనాల కాన్వాయ్‌లో భద్రత మధ్య వీరు బయలుదేరి వెళ్లారు. తొలి బ్యాచ్‌లో 780 మంది పురుషులు, 190 మంది మహిళలు, ఒక చిన్నారి, 120 సాధువులు ఉన్నారు' అని పోలీసులు తెలిపారు.

Read More