Home> జాతీయం
Advertisement

ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్: రూ.850కే డొమెస్టిక్, రూ. 1,999 ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్

విమానయాన రంగం వ్యాపారంలో నెలకొన్న పోటీని ఎదుర్కునేందుకు ఎయిర్ ఏషియా మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. 

ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్: రూ.850కే డొమెస్టిక్, రూ. 1,999 ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్

విమానయాన రంగం వ్యాపారంలో నెలకొన్న పోటీని ఎదుర్కునేందుకు ఎయిర్ ఏషియా మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.850కే డొమెస్టిక్, రూ,1,999కే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ అందించనున్నట్టు ఎయిర్ ఏషియా స్పష్టంచేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ మధ్య కాలంలో ఎయిర్ ఏషియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కానీ లేదా ఆ సంస్థకు చెందిన మొబైల్ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించనున్నట్టు ఎయిర్ ఏషియా తేల్చిచెప్పింది. అయితే, ఎప్పటిలాగే ఇక్కడ ఓ కండిషన్ వర్తించనుంది.  అదేమంటే, 2018 అక్టోబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే నెల 28వ తేదీ మధ్య కాలంలో ప్రయాణం చేసే వారికి మాత్రమే ఈ టికెట్ బుకింగ్ సౌకర్యం వర్తిస్తుంది.  హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూరు, చెన్నై, కోల్‌కతా, నాగపూర్, పూణె, గౌహతి, ఇండోర్, రాంచి, జైపూర్, భువనేశ్వర్, కొచ్చి లాంటి నగరాల మధ్య ఎయిర్ ఏషియా డొమెస్టిక్ సేవలు అందిస్తోంది. 

కౌలాలంపూర్, బ్యాంగ్‌కాక్, ఫూకెట్, మెల్‌బోర్న్ లాంటి అంతర్జాతీయ గమస్యానాలకు రూ.1,999లకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అని ఎయిర్ ఏషియా సంస్థ తమ తాజా ప్రకటనలో పేర్కొంది. 

Read More