Home> జాతీయం
Advertisement

మే 4 నుండి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తాం : ఎయిర్ ఇండియా

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణను అదుపులోఉంచేందుకు విధించిన లాక్ డౌన్ మే 3తో ముగియనున్న నేపథ్యంలో మే 4 నుండి దేశీయ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వ రంగ విమానయాన

మే 4 నుండి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తాం : ఎయిర్ ఇండియా

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణను అదుపులోఉంచేందుకు విధించిన లాక్ డౌన్ మే 3తో ముగియనున్న నేపథ్యంలో మే 4 నుండి దేశీయ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నిర్ణయించింది. ఇదిలాఉండగా బుకింగ్స్ ను పునరుద్ధరించిందని, భారత్ నుండి ఇతర దేశాల ప్రయాణాలకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదని పేర్కొన్నారు. 

Read Also: Coronavirus updates: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

 మరోవైపు ఇతర దేశాల్లోనూ కరోనా లాక్ డౌన్లు కొనసాగుతున్నందున జూన్ 1 నుంచి ఇంటర్నేషనల్ రూట్లలో విమానాలు సర్వీసులు ప్రారంభిస్తామని సూచనప్రాయంగా  ఎయిరిండియా పేర్కొంది. ప్రస్తుతానికి మే 4నుండి ముంబయి, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు వంటి ఎంపిక చేసిన మెట్రో నగరాలకు విమాన సర్వీసులు నిర్వహించనున్నట్లు తెలిపారు. చౌక ధరల విమానయాన సంస్థ అయిన ఇండిగో కూడా మే 4 నుండి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇదే తరహాలో  ఇతర విమానయాన సంస్థలు కూడా మే మొదటి వారం నుంచి సర్వీసులు పునఃప్రారంభించే అవకాశాలున్నట్లు సమాచారం. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More