Home> జాతీయం
Advertisement

Air india: ఎయిర్ ఇండియా మద్యం పాలసీలో మార్పులు, కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి

Air india: విమాన ప్రయాణాల్లో మద్యం పాలసీలో మార్పులు తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా . మీరు తరచూ విమాన ప్రయాణం చేసేవారైతే ఈ వార్త మీ కోసమే. ఎయిర్ ఇండియా మద్యం పాలసీలో వచ్చిన మార్పులివే..

Air india: ఎయిర్ ఇండియా మద్యం పాలసీలో మార్పులు, కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి

ఎయిర్ ఇండియా కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీ ప్రకారం..క్యాబిన్ సిబ్బంది అవసరమైనప్పుడు ఆలోచించి మద్యం అందించవచ్చని ఉంది. అంటే ఇక నుంచి అవసరమనుకున్నప్పుడు ప్రయాణీకులకు మద్యం సురక్షితంగా అందించనుంది విమాన సిబ్బంది. రెండవసారి మద్యం తీసుకుంటే ఆలోచించి వ్యవహరించాలని ఎయిర్ ఇండియా చెబుతోంది. 

లైసెన్స్ సస్పెన్షన్ ఆదేశాల రద్దుకు విజ్ఞప్తి

మొత్తం వ్యవహారంలో పైలట్ సస్పెన్షన్ రద్దు చేయాలని ఉద్యోగుల సమాఖ్య డీజీసీఏకు విజ్ఞప్తి చేసింది. ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన వ్యవహారంలో విమాన పైలట్ లైసెన్స్ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ఆరు ఉద్యోగ సంఘాలు డీజీసీఏకు విజ్ఞప్తి చేశాయి. ఎయిర్ ఇండియాకు చెందిన న్యూయార్క్-న్యూ ఢిల్లీ విమాన ప్రయాణంలో ఓ యాత్రికుడు అత్యంత దారుణంగా ఓ మహిళ యాత్రికురాలిపై మూత్రం పోసిన ఘటనపై ఎయిర్ ఇండియాకు 30 లక్షల జరిమానా విధించింది డీజీసీఏ.

ఇది కాకుండా నవంబర్ 26, 2022న జరిగిన ఈ ఘటనలో తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలమైన కారణంగా ఎయిర్ ఇండియా డైరెక్టర్‌పై కూడా 3 లక్షల జరిమానా విధించింది. ఉద్యోగ సంఘాలు డీజీసీఏకు చేసిన విజ్ఞాపన పత్రంలో వివిధ దశల్ని ఉదహరిస్తూ ఛీఫ్ పైలట్‌పై సస్పెన్షన్ వేటును తొలగించాలని కోరాయి. 

డీజీసీఏకు విజ్ఞాపన పంపించిన ఉద్యోగ సంఘాల్లో ఇండియన్ పైలట్స్ గిల్డ్, ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్, ఎయిర్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్, ఎయిర్ ఇండియా ఉద్యోగుల సమాఖ్య, ఆల్ ఇండియా కేబిన్ క్రూ అసోసియేషన్, ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఈ వ్యవహారంలో దర్యాప్తు ముగిసిందని చెప్పినప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ఈ విజ్ఞాపన పంపింది.

ఎయిర్ ఇండియా మద్యం పాలసీలో తీసుకొచ్చిన మార్పుల ప్రకారం ఇకపై అవసరమైందని భావించినప్పుడు తగిన జాగ్రత్తలతో ప్రయాణీకులకు మద్యం అందించవచ్చు. 

Also read: National Voters Day 2023: నేడే జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు ? చరిత్ర, ప్రాధాన్యత ఏంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More