Home> జాతీయం
Advertisement

Gold Smuggling: శానిటరీ ప్యాడ్స్ లో గోల్డ్ స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ అరెస్టు

Gold Smuggling: శానిటరీ ప్యాడ్స్ (Sanitary Pads) లో గోల్డ్ ను దాచి స్మగ్లింగ్ (Gold Smuggling news) చేసేందుకు ఎయిర్ ఇండియా విమానానికి చెందిన ఓ మహిళ ప్రయత్నించింది. అంతలోనే కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. మహిళ వద్ద నుంచి 2.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

Gold Smuggling: శానిటరీ ప్యాడ్స్ లో గోల్డ్ స్మగ్లింగ్.. ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ అరెస్టు

Gold Smuggling: విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న బంగారాన్ని (Gold Smuggling news) అధికారులు సీజ్ చేశారు. కేరళ కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్​ప్రెస్ విమానంలో 2.4 కిలోల బంగారాన్ని గుర్తించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), ఎయిర్ కస్టమ్స్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.

ఈ విమానం షార్జా నుంచి వచ్చిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకు (Gold Smuggling latest news) సంబంధించి విమానంలో పని చేసే మహిళా సిబ్బందిని అరెస్టు చేశారు. ఆమెను మలప్పురం ప్రాంతానికి చెందిన షహానాగా గుర్తించారు.

షహానా.. తన శానిటరీ ప్యాడ్స్​లో (Sanitary Pads) బంగారాన్ని అక్రమ రవాణా చేసిందని అధికారులు తెలిపారు. వాటిని తన లోదుస్తుల్లో దాచిందని చెప్పారు. దీనిపై తమకు సమాచారం అందిందని, దీంతో విమానం కోజికోడ్​లో ల్యాండ్ అవ్వగానే తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. 

Also Read: Tamil Nadu rains: తమిళనాడును వీడని వర్షాలు- చెన్నైకి రెడ్ అలర్ట్​

Also Read: Man kills wife : టవల్ ఆలస్యంగా ఇచ్చిందని భార్యనే చంపిన భర్త 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More