Home> జాతీయం
Advertisement

Gautam Adani: వారెన్ బఫెట్‌ను అధిగమించిన అదానీ.. ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానం!

Gautam Adani: భారత వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే 5వ అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించారు. 
 

Gautam Adani: వారెన్ బఫెట్‌ను అధిగమించిన అదానీ.. ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానం!

Gautam Adani News: ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) ప్రపంచంలో ఐదో అత్యంత సంపన్న వ్యక్తి నిలిచారు. దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్‌ను (Warren Buffett) వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని ఆక్రమించారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం, వారెన్ బఫెట్ నికర విలువ 121.7 బిలియన్ల్ డాలర్లు కాగా...అదానీ నికర విలువ 123.7 బిలియన్ల డాలర్లుగా ఉంది. యూఎస్ స్టాక్ మార్కెట్ లో శుక్రవారం బెర్క్‌షైర్ హాత్వే షేర్లు 2 శాతం పడిపోయినందున అదానీ.. బఫెట్‌ను అధిగమించగలిగాడు. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రస్తుతం అదానీ ఉన్నారు. 

మరో భారత వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) 8వ స్థానంలో నిలిచారు. అంబానీ నికర విలువ 104.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫోర్బ్స్ డేటా ప్రకారం చూస్తే... ప్రపంచంలోని టాప్-10 ధనవంతుల్లో ఇద్దరు భారతీయులు ఉండటం విశేషం. ప్రపంంచలోనే అత్యంత సంపన్నుడిగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ (Elon Musk) నిలిచాడు. అతడు 269.70 బిలియన్ డాలర్ల నికర సంపదతో తొలి స్థానంలో ఉన్నాడు. 170.2 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ కింగ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 167.9 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలోనూ.. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలోనూ ఉన్నారు. 

Also Read: Redmi 10A Amazon: Redmi నుంచి మరో స్మార్ట్ ఫోన్.. అమెజాన్ లో సేల్ ప్రారంభం! 

టాప్ 10 ధనవంతులు వీరే..
1. ఎలాన్ మస్క్ - 269.70 బిలియన్ డాలర్లు
2. జెఫ్ బెజోస్ -170.2 బిలియన్ డాలర్లు
3. బెర్నార్డ్ ఆర్నాల్ట్ - 167.9 బిలియన్ డాలర్లు
4. బిల్ గేట్స్ - 130.2 బిలియన్ డాలర్లు
5. గౌతమ్ అదానీ -123.7 బిలియన్ డాలర్లు
6. వారెన్ బఫెట్ - 121.7 బిలియన్ డాలర్లు
7. లారీ ఎల్లిసన్- 107.6 బిలియన్ డాలర్లు
8. ముఖేష్ అంబానీ- 103.7 బిలియన్ డాలర్లు
9. లారీ పేజీ- 102.4 బిలియన్ డాలర్లు
10. సెర్గీ బ్రిన్- 98.5 బిలియన్ డాలర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More