Home> జాతీయం
Advertisement

ప్రధాని మోడీకి కౌంటర్ ; ఫిట్‌నెస్‌తో పాటు నిరుద్యోగాన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలి

 ఫిటెనెస్ విషయంలో కోహ్లీ ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రధాని మోడీపై కౌంటర్ ఎటాక్ మొదలైంది.

ప్రధాని మోడీకి కౌంటర్ ; ఫిట్‌నెస్‌తో పాటు నిరుద్యోగాన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలి

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన ఫిటెనెస్ ఛాలెంజ్ ను ప్రధాని మోడీ స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆర్జేడీ నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్‌నెట్‌ను  ఛాలెంజ్‌గా తీసుకున్న మోడీకి నా అభినందనలు..ఇదే సమయంలో దేశంలో ఉన్న సమస్యలను కూడా ప్రధాని ఛాలెంజ్ గా తీసుకోవాలని హితవు పలికారు. నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు, మైనార్టీల భద్రత వంటి అంశాలను ప్రధాని  ఛాలెంజ్ గా తీసుకోగలరా అంటూ తేజస్వీ ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా తేజస్వీ మాట్లాడుతూ కోహ్లీ చేసిన ఫిటెనెస్ ఛాలెంజ్ కు తాను వ్యతిరేకం కాదని.. అయితే రోజు రోజుకు పెరుగుతున్న నిరుద్యోగం, రైతు ఆత్మహత్యలు, మైనార్టీలపై దాడి వంటి అంశాలు దేశానికి పెను సవాళ్లుగా ఉన్నాయని..  ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఈ సవాళ్ల స్వీకరించాలనేదే తన ఉద్దేశమన్నారు...తాను లేవనెత్తినఅంశాలను ప్రధాని మోడీ ఛాలెంజ్ గా తీసుకోగలరా అంటూ తేజస్వీ ట్వీట్ చేశారు

టీమిండియా కెప్టెన్ విసిరిన ఫిటెనెస్ ఛాలెంజ్ ను ప్రధాని మోడీ స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ఇక తన ముందున్న సవాల్ కు సిద్ధమేనని.. పూర్తి స్థాయి ఫిటెనెస్ ను సాధించి ఆ వీడియోను షేర్ చేస్తానని   ట్వీట్ చేశారు. ప్రధాని మాటల్లో చెప్పాలంటే...'' విరాట్.. నువ్వు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నా. త్వరలోనే నా ఫిట్‌నెస్ ఛాలెంజ్ వీడియోను షేర్ చేస్తానంటూ కోహ్లి ట్వీట్‌కు బదులిచ్చారు. ఈ నేపథ్యంలో తేజస్వీ ఈ మేరకు ప్రధాని మోడీకి  కౌంటర్ ఇచ్చారు.

Read More