Home> జాతీయం
Advertisement

Aadhaar Card Updates: ఆధార్ కార్డులో ఫోటో, అడ్రస్ సులభంగా మార్చుకునే పద్ధతి ఇదే

Aadhaar Card Updates: ఆధార్ కార్డు ప్రతి పనికీ అవసరమైన డాక్యుమెంట్. ఆధార్ కార్డు లేకుండా ప్రస్తుతం ఏ పనీ జరగదు. అందుకే ఆధార్ కార్డు ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండాలి. ఫోటో, ఫోన్ నెంబర్, అడ్రస్ వివరాలు ఇంట్లో కూర్చుని సులభంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం

Aadhaar Card Updates: ఆధార్ కార్డులో ఫోటో, అడ్రస్ సులభంగా మార్చుకునే పద్ధతి ఇదే

Aadhaar Card Updates: ప్రభుత్వ పని అయినా లేదా ప్రైవేట్ పని అయినా ఆధార్ కార్డు లేకుండా జరగదు. ఆఖరికి సిమ్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు ఉండాల్సిందే. బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెనింగ్‌కు కూడా ఆధార్ కార్డు అవసరం. అంత అవసరమైన ఆధార్ కార్డులో వివరాలు ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉండాలి. లేకపోతే సమస్యలు ఎదురుకావచ్చు. 

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు జారీ చేస్తుంటుంది. ఇదొక ఐడీ అండ్ అడ్రస్ ప్రూఫ్ కార్డు. ప్రతి వ్యక్తి బయోమెట్రిక్ వివరాలు ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. చాలామంది ఆధార్ కార్డులు అప్‌డేట్ అయి ఉండవు. ముఖ్యంగా పేరు లేదా చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ప్రింట్ అవడమో లేదా మారిపోవడం జరగవచ్చు. కొంతమంది ఫోటోలు ఎప్పుడో పాతవి ఉంటాయి. అవి మార్చుకోవల్సి వస్తుంది. ఈ వివరాలు ఎప్పటికప్పుుడు మార్చుకోకపోతే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే ఈ వివిరాలు మార్చుకోవడం చాలా సులభం. ఎలాగనేది తెలుసుకుందాం..

ఆధార్ కార్డులో ఫోటో, అడ్రస్ మార్చడం ఎలా

మీ ఆధార్ కార్డులో ఫోటో లేదా అడ్రస్ మార్చుకోవాలంటే ముందుగా https://appointments.uidai.gov.in/bookappointment.aspx వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మీ సమీపంలోని సేవా కేంద్రం నుంచి అప్పాయింట్‌మెంట్ టైమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి ఫామ్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. అడ్రస్ మార్చుకు అయితే డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి. ఫోటో, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ మార్చేందుకు ఎలాంటి ఆధారం అవసరం లేదు. 

అక్కడ మీ బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకుంటారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక మీకొక స్లిప్ ఇస్తారు. అందులో ఉండే నెంబర్ ఆధారంగా మీ ఆధార్ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే ఫోన్ నెంబర్, అడ్రస్ మార్పు వివరాలను ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చు.

Also read: Samsung Galaxy M05: 50MP కెమేరాతో శాంసంగ్ ఫోన్ కేవలం 8 వేలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More