Home> జాతీయం
Advertisement

Kulgam Encounter: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం

Kashmir encounter: జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. వివరాల్లోకి వెళితే..
 

Kulgam Encounter: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం

Kulgam Encounter: జమ్ముకశ్మీర్‌ (Jammu And Kashmir) కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు(Army Soldiers) వీరమరణం పొందారు. కుల్గాం జిల్లాలోని (Kulgam) హలాన్‌ (Halan forest area) అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు(Terrorists) నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు శుక్రవారం కార్డన్‌ సెర్చ్‌ (Cordon Search) ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 

భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదులు ఒక్కసారిగా జవాన్లపైకి కాల్పులు జరపడడంతో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని సైనిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇదే సమయంలో అదనపు సైనిక బలగాలు ఘటన స్థలికి చేరుకున్నాయి. ప్రస్తుతం కుల్గామ్ జిల్లాలో నక్కిన ముష్కరుల కోసం భారత సైన్యంగా తీవ్రంగా గాలిస్తుంది. 

మరోవైపు శ్రీనగర్ లోని నాతిపోరాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో నిషేధిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన  ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 3 హ్యాండ్ గ్రెనేడ్లు, 10 ఫిస్టల్స్, 25 ఏకే-47 గన్స్ మరియు పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను  ఇమ్రాన్ అహ్మద్ నజర్, వసీమ్ అహ్మద్, వకీల్ అహ్మద్ భట్ గా పోలీసులు గుర్తించారు. 

Also Read: Student Suicide Note: కన్నీళ్లు పెట్టించే సూసైడ్ నోట్.. డాక్టర్ అవుతానని వెళ్లి శవమై వచ్చాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More