Home> జాతీయం
Advertisement

Bengaluru Rape: బెంగళూరులో దారుణం... నర్సుపై నలుగురు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ గ్యాంగ్ రేప్...


Gang Rape on Nurse in Bengaluru: బెంగళూరులో దారుణం వెలుగుచూసింది. ఓ నర్సుపై నలుగురు జాతీయ స్థాయి ప్రొఫెషనల్ స్విమ్మర్స్ గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు.

Bengaluru Rape: బెంగళూరులో దారుణం... నర్సుపై నలుగురు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ గ్యాంగ్ రేప్...

Gang Rape on Nurse in Bengaluru: బెంగళూరులో దారుణం వెలుగుచూసింది. ఓ నర్సుపై నలుగురు జాతీయ స్థాయి ప్రొఫెషనల్ స్విమ్మర్స్ గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు యువతికి డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యాడు. ఇటీవల ఇద్దరూ ఓ హోటల్లో కలుసుకున్నారు. అనంతరం అతని ఆహ్వానం మేరకు అతని గదికి వెళ్లింది. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి యువతిపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ బెంగాల్‌కి చెందిన 22 ఏళ్ల యువతి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఢిల్లీకి చెందిన రజత్ అనే ప్రొఫెషనల్ స్విమ్మర్ ఆమెకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన రజత్ ఆమెను డిన్నర్‌కు ఆహ్వానించాడు. ఇద్దరు కలిసి ఓ హోటల్లో డిన్నర్ చేశారు. అనంతరం తన గదికి రావాల్సిందిగా యువతిని అతను కోరాడు. దీంతో అతనితో పాటు ఆమె అతని గదికి వెళ్లింది.

అదే గదిలో అతనితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కూడా ఉంటున్నారు. ఆ రాత్రి రజత్‌తో పాటు అతని ముగ్గురు స్నేహితులు కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. జరిగిన ఘటనపై శుక్రవారం (మార్చి 25) తెల్లవారుజామున బాధితురాలు తన స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో ఆమె స్నేహితులు అక్కడికి చేరుకుని యువతిని రక్షించారు. అదే రోజు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రేప్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులంతా జాతీయ స్థాయి ప్రొఫెషనల్ స్విమ్మర్స్ అని... ప్రస్తుతం బెంగళూరులో శిక్షణ పొందుతున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రజత్‌తో సహా నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: కేజ్రీవాల్ నివాసంపై దాడి... హత్య చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆప్ సంచలన ఆరోపణ

Also Read: ఇక వేములవాడపై కేసీఆర్ ఫోకస్.. చిన జీయర్‌కు చెక్.. త్వరలో భారతీ తీర్థ స్వామి వద్దకు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More