Home> జాతీయం
Advertisement

నేడే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, సర్వం సిద్ధం

శనివారం సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన కొన్ని గంటల తరువాత, అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఢిల్లీ పోలీసులతో పాటు సాయుధ పారా మిలటరీ కమాండోల సమక్షంలో తరలించి భద్రపర్చారు.  

నేడే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, సర్వం సిద్ధం

న్యూఢిల్లీ : శనివారం సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసిన కొన్ని గంటల తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లారు. ఢిల్లీ పోలీసులతో పాటు సాయుధ పారా మిలటరీ కమాండోల సమక్షంలో తరలించి భద్రపర్చారు.  

ఫిబ్రవరి 11 (మంగళవారం) లెక్కింపు రోజున ప్రతి కేంద్రం వద్ద కనీసం 200 మంది భద్రతా సిబ్బందికి రక్షణగా ఉంటుందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కౌంటింగ్ రోజున ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 

శనివారం, 42,000 ఢిల్లీ పోలీసు సిబ్బందితో పాటు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్)కు చెందిన 190 కంపెనీలతో పోలింగ్ సమయంలో శాంతిభద్రతలను నిర్వహించడానికి ఏర్పాటు చేశామన్నారు. దీనితో పాటు, 19,000 హోమ్ గార్డ్లను కూడా బలగాలకు అందించారని అన్నారు,

శనివారం రాత్రి, పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలలో అవకతవకలున్నాయని ఆరోపిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఒక వీడియోను ట్వీట్ చేసి, ఎన్నికల కమిషన్ దీనిని గమనించాలని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More