Home> జాతీయం
Advertisement

ఆప్‌ను గెలిపించిన అంశమిదే: బీజేపీ ఎంపీ

ఢిల్లీ ప్రజలకు 200యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రకటనే ఆప్ విజయానికి బాటలు వేసిందన్నారు బీజేపీ ఎంపీ రమేష్ బిదురి. తాజా ఓట్ల లెక్కింపులో ఆప్ 55స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

ఆప్‌ను గెలిపించిన అంశమిదే: బీజేపీ ఎంపీ

న్యూఢిల్లీ: విద్యుత్ ఛార్జీల అంశం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు కలిసొచ్చిందన్నారు బీజేపీ ఎంపీ రమేష్ బిదురి. నెలకు 200 యూనిట్లలోపు కరెంట్ వినియోగించే వారికి బిల్లు వసూలు చేయడం లేదంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం పేద పేదలపై భారీగా ప్రభావం చూపిందన్నారు. కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందు విద్యుత్ బిల్లులను వసూలు చేయకపోవడం వర్తించడంతో ఢిల్లీ ప్రజలు ఆప్ వైపు మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, వాటి ప్రయోజనాలను ఢిల్లీ ప్రజలకు వివరించడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారని పేర్కొన్నారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి

ఢిల్లీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన కల్పించింటే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వచ్చేదన్నారు. నీటి సరఫరా, ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలు, మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి చాలా అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ షాహిన్ బాగ్‌లో నిరసన తెలిపిన వారిని ద్రోహులని బీజేపీ నేతలు కామెంట్ చేయడం, అలాంటివారిని కాల్చిపారేయాలన్న వ్యాఖ్యలపై సైతం రమేష్ బిదురి స్పందించారు. ద్రోహులను కాల్చివేయాలనడంతో తప్పేముందని ఢిల్లీ ఓట్ల లెక్కింపు రోజు కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. 

Also Read: ఢిల్లీ ప్రజలు AAPకే పట్టం కడతారు: డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా

కాగా, ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార ఆప్ దూకుడు కొనసాగిస్తోంది. మొత్తం 70 స్థానాలకుగానూ ఆప్ 57 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 13 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. వరుసగా రెండో ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరిచేలా కనిపించడం లేదు. అయితే బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ మాత్రం తమకు ఇంకా అవకావం ఉందని, నిరాశకు లోనవ్వొద్దని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.

Also Read: బీజేపీ 55 సీట్లు నెగ్గుతుంది!: మనోజ్ తివారీ

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Read More