Home> జాతీయం
Advertisement

New coronavirus: యూకే రిటర్న్స్ టు ఇండియాలో 20 మందికి పాజిటివ్..పెరుగుతున్న భయం

New coronavirus: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించేసిందా..8మందికి కాదు 20మంది యూకే రిటర్న్స్‌కు పాజిటివ్‌గా తేలడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

New coronavirus: యూకే రిటర్న్స్ టు ఇండియాలో 20 మందికి పాజిటివ్..పెరుగుతున్న భయం

New coronavirus: బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్ ఇండియాలో ప్రవేశించేసిందా..8మందికి కాదు 20మంది యూకే రిటర్న్స్‌కు పాజిటివ్‌గా తేలడంతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

చైనా నుంచి విస్తరించిన కరోనా వైరస్ ( Coronavirus ) కాదిప్పుడు..బ్రిటన్ కొత్త రకం కరోనా వైరస్ ( Britain new coronavirus ) భయపెడుతోంది. బ్రిటన్ నుంచి నెదర్లాండ్స్, బ్రెజిల్, ఇటలీ, ఆస్ట్రేలియాలు దాటుకుంటూ ఇప్పుడు ఇండియాలో ప్రవేశించిందనే వార్తలు కలవరం కల్గిస్తున్నాయి. యూకే రిటర్న్స్‌కు ( Uk returns ) నిర్వహించిన పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్ ( Corona positive )గా తేలింది. అయితే వీరిలో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ ( New coronavirus strain ) ఉన్నదీ లేనిదీ ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఈ 20 మందిలో బ్రిటన్ నుంచి ఢిల్లీ, కోల్ కత్తా, అహ్మదాబాద్, చెన్నై, అమృత్‌సర్‌కు వచ్చినవారున్నారు. 

కరోనా పాజిటివ్‌గా తేలిన ఈ 20మంది లండన్ నుంచి ఎయిర్ ఇండియా  ( Air India ) విమానాల ద్వారా నేరుగా వివిధ నగరాలు వెళ్లారు. ప్రస్తుతం 20మందిని క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రిటన్ ( Britain ) నుంచి విమానాల రాకపోకలపై భారత్ నిషేధం విధించే సమయానికే బ్రిటన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చినవారు ఇంకా చాలామందికి ఉన్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్‌గా సోకిన 20మందిలో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ఉన్నట్టు తేలితే మాత్రం చాలా ప్రమాదకర పరిణామమే. అదే విమానాల్లో వీరితో పాటు ప్రయాణించివారందర్నీ గుర్తించి..క్వారెంటైన్‌లో ఉంచాల్సిన పరిస్థితి. 

Also read: India Bans UK Flights: యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై నిషేధం

బ్రిటన్ నుంచి డిసెంబర్ 22వ తేదీన మూడు విమానాల ద్వారా 590 మంది ముంబైకు చేరారు. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి దాదాపు 5 వందల మంది వచ్చారు. మరోవైపు లండన్ నుంచి 222 మంది ప్రయాణీకులతో మరో విమానం ఆదివారం రాత్రి కోల్‌కత్తా చేరుకుంది.  అటు అమృత్‌సర్‌కు యూకే నుంచి 250 మంది వచ్చారు. 

కొత్త కరోనా వైరస్ ముప్పు నేపధ్యంలో కేంద్రం ( Central government ) తాజాగా మార్గదర్శకాల్ని జారీ చేసింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్యకాలంలో యూకేలో పర్యటించిన ప్రయాణీకులంతా విధిగా పాటించాల్సిన నిబంధనల్ని విడుదల చేసింది. అందరూ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుని..పాజిటివ్ తేలితే ఇనిస్టిట్యూషనల్ క్వారెంటైన్  కేంద్రంలో ఉండాలని సూచించింది. 

అయితే బ్రిటన్ కొత్త రకం కరోనా వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతోంది. ఇండియాలో ఇప్పటివరకూ అలాంటి ఉత్పరివర్తనం కన్పించలేదంటోంది. వైరస్ వేరియంట్‌తో ప్రస్తుత వ్యాక్సిన్ ప్రయోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదని నీతి ఆయోగ్ ( Niti Aayog ) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఈ వైరస్‌ను సూపర్ స్పైడర్‌గా భావించవచ్చంటున్నారు వైద్యులు. 

Also read: RBI Positive Pay: ఆర్బిఐ కొత్త చెక్ పేమెంట్ విధానం గురించి తెలుసుకోండి

Read More