Home> జాతీయం
Advertisement

Rajya Sabha: రాజ్యసభలో ఏకంగా 10 స్థానాలు ఖాళీ.. అసలు ట్విస్ట్ ఇదే..

Rajya Sabha: 2024లో దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో  రాజ్యసభలో ఏకంగా 10 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన రాజ్యసభ సెక్రటేరియట్  ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Rajya Sabha: రాజ్యసభలో ఏకంగా  10 స్థానాలు ఖాళీ.. అసలు ట్విస్ట్ ఇదే..

Rajya Sabha:  దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఏకంగా 240 లోక్ సభ సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు మిత్రపక్షాలతో కలిసి 292 సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. మరోవైపు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసారు. ఈ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు ఎన్నికయ్యారు. దీంతో పెద్దల సభలో 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ విషయాలను రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికంగా ప్రకటించింది. 18వ లోక్ సభకు వారు ఎన్నిక కావడంతో వారి రాజ్యసభ సభ్యత్యం జూన్ 4న వెలుబడిన ఎన్నికల ఫలితాల రోజునే నిలిచిపోయింది. మహారాష్ట్ర, అస్సాం, బిహార్ నుంచి రెండేసి చొప్పున ఖాళీ అయ్యాయి.

హరియాణ, రాజస్థాన్,త్రిపుర, మధ్య ప్రదేశ్ నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయింది. రాజ్యసభ నేతగా ఉన్న పీయూష్ గోయల్.. మహారాష్ట్ర నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. బిప్లవ్ కుమార్ దేవ్ త్రిపుర మాజీ సీఎం త్రిపుర నుంచి గెలిచారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న జ్యోతిరాదిత్య సింధియా లోక్ సభకు ఎన్నికయ్యారు. అస్సామ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సర్వానంద సోనేవాల్, కామాఖ్య ప్రసాద్ అస్సామ్ నుంచి లోక్ సభకు ఎలెక్ట్ అయ్యారు.  లాలూ ప్రసాద్ యాదవ్ కూతరు మీసా భారతి తాజాగా జరిగిన ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి వరకు ఆమె బిహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఉదయన్ రాజే భోంస్లే తాజాగా జరిగిన ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నియ్యారు.

ఇక హరియాణ నుంచి దీపేందర్ సింగ్ హుడా, రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న కేసీ వేణుగోపాల్ కేరళ నుంచి ఎంపీగా గెలిచారు. తాజాగా వీరు లోక్ సభకు ఎన్నిక కావడంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. త్వరలో వీటి ఎలక్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ వెలుబడనుంది. ఇందులో ఎక్కువగా మళ్లీ ఎన్టీయే కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఈ సారి నరేంద్ర మోడీ సహా మొత్తంగా 72 మంది ప్రమాణ స్వీకారం చేసారు. రాజ్యసభ నేతగా ఉన్న పీయూష్ గోయల్ కు కేంద్ర కేబినేట్ లో వాణిజ్యం, పరిశ్రమల శాఖను కేటాయించారు. మరోవైపు సర్భానంద్ సోనే వాల్ కు షిప్పింగ్, జల రవాణా శాఖ కేటాయించారు. అటు జ్యోతిరాదిత్య సింధియాకు గతంలో నిర్వహించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ ప్లేస్ లో కమ్యూనికేషన్లు.. టెలికమ్యూషన్లు,  నార్త్ ఈస్త్ స్టేట్స్ అభివృద్ధితో శాఖలు దక్కాయి.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More