Home> హెల్త్
Advertisement

World Malaria Day 2022: మలేరియా దినోత్సవం సందర్భంగా స్పెషల్‌ స్టోరీ..మలేరియా లక్షణాలు, నివారణ చర్యలు

World Malaria Day 2022: మలేరియా ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలను బలి తీస్తుకుంటుంది. ఇది ఓ దోమ కాటు వల్ల వచ్చే వ్యాధి. మలేరియా దోమ కుట్టినప్పుడు రక్తంలో ఓ హానికరమైన పరాన్న జీవిని వదిలేస్తుంది. దీంతో మన శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను దెబ్బతీస్తుంది. దీని తీవ్రత వర్షకాలంలో ఎక్కువగా ఉంటుంది.

World Malaria Day 2022: మలేరియా దినోత్సవం సందర్భంగా స్పెషల్‌ స్టోరీ..మలేరియా లక్షణాలు, నివారణ చర్యలు

World Malaria Day 2022: మలేరియా ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలను బలి తీస్తుకుంటుంది. ఇది ఓ దోమ కాటు వల్ల వచ్చే వ్యాధి. మలేరియా దోమ కుట్టినప్పుడు రక్తంలో ఓ హానికరమైన పరాన్న జీవిని వదిలేస్తుంది. దీంతో మన శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను దెబ్బతీస్తుంది. దీని తీవ్రత వర్షకాలంలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు..ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు, చికిత్స, నివారణ పద్ధతులను తెలుసుకుందాం.

ఏ దోమతో ఈ వ్యాధి సంక్రమిస్తుంది:

ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుంది.  మలేరియా వచ్చే సమయంలో ముందుగానే గ్రహించి విముక్తి పొందేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. లేదంటే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దోమల తీవ్రత వర్షకాలంలో ఎక్కువగా ఉంటుంది కనుక వర్షకాలంలో తగు జాగ్రత్తలు పాటిస్తే మంచిదని వైద్యులు తెలిపారు.

మలేరియా లక్షణాలు:
 
మలేరియా వచ్చిన వారి శరీరం తరచుగా చల్ల పడుతుంది. అధికంగా జ్వరం రావడమే కాకుండా రోగికి విపరీతంగా చెమటలు పడతాయి.  ఇవే కాకుండా తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, అతిసారం, రక్తహీనత, కండరాల నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొంతమంది మలేరియా రోగులల్లో మూర్ఛ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శరీరంలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదింస్తే మలేరియా నుంచి విముక్తి పొందవచ్చు.

మలేరియా ప్రాణాంతకమేనా:

మలేరియా సోకిన రోగికి సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతక పరిణామాలు రావోచ్చు. ఈ  మలేరియా వల్ల రోగి మెదడులోని రక్తనాళాల్లో వాపు, ఊపిరితిత్తులలో ద్రవం చేరడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి.  వైద్య భాషలో దీనిని పల్మనరీ ఎడెమా(Pulmonary edema)అని అంటారు. ఇదే కాకుండా మలేరియా సోకిన వ్యక్తులకు కాలేయం, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలు చెడిపోయే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. దోమ వదిలిన పరాన్న జీవి ఎర్ర రక్త కణాలు దెబ్బతిసి రక్తహీనతకు దారితీస్తుంది. దీంతో రోగికి షుగర్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

మలేరియా నివారణకు చర్యలు:

#మలేరియాను నివారించడానికి మీ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.
#ఇంటి వద్ద ఉన్న మురుగు గుంటల్లో నిలిచిన నీటిని తొలగించాలి.
#దోమలు వృద్ధి చెందకుండా చూడాలి.
#వర్షకాలం డ్రైనేజిల్లో నిలిచిన వర్షపు నీటిని ప్రవహించేలా చూడాలి.
#గార్డెన్ ప్రదేశాల్లో  ఎప్పటికప్పుడు పురుగుల మందులను పిచికారీ చేస్తూ ఉండాలి.
#ఇంటి పరిసరాల్లో నీరు పేరుకుపోకుండా  జాగ్గత్తలు తీసుకోవాలి.
#నీటి ట్యాంకులపై దోమలు చేరకుండా సరిగ్గా మూత పెట్టాలి.
#దోమలు ఇంటి లోపలకి రాకుండా తగు చర్యలు చేపట్టాలి.

Also Read:   Congress Leader Dies: కాంగ్రెస్ పార్టీలో విషాదం... అనారోగ్యంతో సీనియర్ నేత కన్నుమూత...

Also Read:  Yatra Online IPO: ఐపీఓకు దరఖాస్తు చేసుకున్న ప్రముఖ ట్రావెలింగ్ కంపెనీ యాత్ర!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More