Home> హెల్త్
Advertisement

Wine and Health: ఆ వైన్ తాగితే గుండె సమస్య దూరమైపోతుందట..ఇవీ వివరాలు

Wine and Health: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది ముమ్మాటికీ నిజమే. కానీ వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని ఎవరైనా అంటే నమ్మడం కష్టమే అవుతుంది. కానీ ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు ఓ రీసెర్చ్‌లో ఈ విషాయన్నే వెలుగులోకి తీసుకొచ్చారు. రీసెర్చ్ ప్రకారం రెడ్‌వైన్ లేదా వైట్‌వైన్‌లు గుండెకు చాలా మంచిదిని తేలింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
 

Wine and Health: ఆ వైన్ తాగితే గుండె సమస్య దూరమైపోతుందట..ఇవీ వివరాలు

Wine and Health: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది ముమ్మాటికీ నిజమే. కానీ వైన్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనని ఎవరైనా అంటే నమ్మడం కష్టమే అవుతుంది. కానీ ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు ఓ రీసెర్చ్‌లో ఈ విషాయన్నే వెలుగులోకి తీసుకొచ్చారు. రీసెర్చ్ ప్రకారం రెడ్‌వైన్ లేదా వైట్‌వైన్‌లు గుండెకు చాలా మంచిదిని తేలింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.

ఇంగ్లండ్‌లోని ఏంగ్లియా రస్కిన్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో..వైన్ తాగడం ద్వారా గుండె సంబంధిత రోగాల్నించి తప్పించుకోవచ్చని తేలింది. ద్రాక్షలో ఉండే పోషక పదార్ధాల కారణంగా రెడ్ అండ్ వైట్ ఆర్టరీస్‌కు ప్రయోజనం కలుగుతుందని అధ్యయనంలో తేలింది. అందుకే వైన్ ద్వారా గుండె రోగాల్నించి తప్పించుకోవచ్చంటున్నారు. 

పోలీఫెనోల్స్ అనే పదార్ధాలు ఎక్కువగా కూరగయాలు, ధాన్యాల్లో ఉంటాయనేది పరిశోధకులు చెప్పే మాట. వైన్‌లో(Wine) పోలీఫెనోల్స్ ఎక్కువ మోతాదులోనే ఉంటుందట. ఈ పోలీఫెనోల్స్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వాస్తవానికి పోలీఫెనోల్స్ పోషకపదార్ధం. ఎక్కువగా ప్రాకృతికంగా మొక్కల్లో ఉంటుంది.  8 వేలకు పైగా ఉండే పోలీఫెనోల్స్‌లో పండ్లు కూడా ఉన్నాయి. కూరగాయలున్నాయి. ఏంగ్లియా విశ్వ విద్యాలయంకు చెందిన డాక్టర్ రూడోల్ఫ్ 4 లక్షల 46 వేలమందిపై పరిశీధనలు చేశారు. ఈ పరిశోధనలో వైన్ తాగేవారితో తాగనివారిని పోల్చి చూశారు. ఆ తరువాత ఫలితాల్ని విశ్లేషించారు. 

రెడ్ లేదా వైట్‌వైన్ (White Wine) తాగడానికి కొరోనరీ హార్ట్ డిసీజెస్‌కు (Heart Diseases) మధ్య కచ్చితంగా సంబంధముందనేది పరిశోధకుల వాదన. అధ్యయనంలో కూడా రెండు రకాల వైన్‌లు ఈ కోరోనరీ హార్ట్ డిసీజ్‌లో సురక్షితమని తేలింది. అయితే ఇతర రకాల గుండె సంబంధిత వ్యాధుల్లో ఎంతవరకూ మేలు చేకూరుస్తుందనేది ఇంకా స్పష్టత లేదు. అయితే మద్యపానంతో కూడా అంటే ఆల్కహాల్‌తో కూడా ఏమైనా ప్రయోజనముంటుందా అనే ప్రశ్న విన్పిస్తోంది. దీనికి సమాధానం ముమ్మాటికీ కాదనే. ఎందుకంటే ఆల్కహాల్ ఫ్రీ వైన్‌తోనే (Alcohol Free Wine) ప్రయోజనమనేది ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ లేని వైన్‌లోనే పోలిఫెనోల్స్ ఉంటాయిట. అదే సమయంలో ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవిస్తే గుండెకు నష్టం కలుగుతుందట.

Also read: Diabetes New Medicine: మధుమేహానికి సరికొత్త మందు, సెమాగ్లూటైడ్ ఇక ట్యాబ్లెట్ రూపంలో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More