Home> హెల్త్
Advertisement

Weight Loss Without Exercise: ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఈ బెస్ట్ హోమ్ రెమెడీస్‌తో మీ నడుమును జీరో సైజ్ చేసుకోండి..

Weight Loss Without Exercise: ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు వైద్య నిపుణులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్ ని ప్రతిరోజు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా బరువు పెరగడం కారణంగా వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. అయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి హోమ్ రెమెడీస్ ని పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Weight Loss Without Exercise: ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఈ బెస్ట్ హోమ్ రెమెడీస్‌తో మీ నడుమును జీరో సైజ్ చేసుకోండి..

Weight Loss Without Exercise In 10 Days: స్ట్రీట్ ఫుడ్స్ అతిగా తినేవారు ఒక్కసారిగా బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ బారిన కూడా పడుతున్నారు. ఒక్కసారిగా బరువు పెరగడం కారణంగా మిమ్మల్ని అనేక రకాల వ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారు సులభంగా అధిక రక్తపోటు బారిన పడతారు. కాబట్టి సులభంగా, ఆరోగ్యంగా శరీర బరువును నియంత్రించుకుంటే చాలా మంచిది లేకపోతే ప్రాణాంతకంగా మారే ఛాన్సులు కూడా ఉన్నాయి. పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి అనేక రకాల హోం రెమిడీస్ ఉన్నాయి. 

వీటిని వినియోగించడం వల్ల బరువు తగ్గినప్పటికీ కొన్ని రోజుల తర్వాత మళ్లీ పెరుగుతున్నారు. అయితే శాశ్వతంగా బరువు తగ్గాలనుకునే వారికి మేము ఈరోజు కొన్ని చిట్కాలు వివరించబోతున్నాం..వాటిని పాటించడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరం ఆరోగ్యంగా తయారవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో? ఆ చిట్కాలకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బరువు శాశ్వతంగా తగ్గాలనుకునేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజూ తినే ఆహారాల్లో అనారోగ్యకరమైన ఆయిల్ ఫుడ్స్ ఉండకుండా చూడాలి. మీకు ఎంత వీలైతే అంతగా ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా డైట్ పద్ధతిని పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా సులభంగా నియంత్రణలో ఉంటాయి. 

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

బరువు తగ్గే క్రమంలో వాకింగ్‌ చేయడం తప్పనిసరి.. అయితే చాలామంది వాకింగ్‌ చేసిన తర్వాత ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో షుగర్ లెవెల్స్ అధికంగా ఉండే వాటిని అతిగా తాగుతున్నారు. ఇలా బరువు తగ్గే క్రమంలో షుగర్ లెవెల్స్ అధిక పరిమాణంలో ఉండే డ్రింక్స్ తో పాటు ఆహారాలను తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందరు. అంతేకాకుండా ఈ డ్రింక్స్ ని తీసుకోవడం వల్ల తీవ్ర దుష్ప్రభావాల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలను బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో లెమన్ వాటర్ తాగాల్సి ఉంటుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని అందులోనే రెండు టీ స్పూన్ల తేనెను వేసి బాగా మిక్స్ చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ప్రతిరోజు ఉదయం పూట నిమ్మరసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More