Home> హెల్త్
Advertisement

Back Pain: వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నడుము నొప్పి వస్తుందా, ఈ Health Tips పాటిస్తే సరి 

Ways To Cure Back Pain: మీకు గత కొంతకాలం నుంచి నడుము నొప్పి, వెన్ను నొప్పి వస్తుందా, అయితే ఈ ఆరోగ్య చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. రీసెర్చ్‌లలో తేలిన అంశాల ద్వారా హెల్త్ టిప్స్ ఇక్కడ అందిస్తున్నాం.

Back Pain: వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల నడుము నొప్పి వస్తుందా, ఈ Health Tips పాటిస్తే సరి 

Health Tips To Cure Back Pain: కరోనా మహమ్మారి మన జీవితంలో ఊహించని మార్పులను తెస్తుంది. ఉద్యోగులు ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డారు. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నా, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాలలో తేలింది. ఉద్యోగులు గంటల తరబడి కూర్చుని పనిచేయడంతో వెన్ను నొప్పి సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం, 80 శాతం మంది పెద్దలు వారి జీవితంలో ఒక్కసారైనా వెన్నునొప్పిని అనుభవించి ఉంటారు. అయితే ఈ నొప్పిని తేలికగా తీసుకోవద్దు. మీ మొత్తం బరువులో మెడ నుంచి తొడల వరకు ఉండే శరీర భాగం సగం బరువు కలిగి ఉంటుంది. కనుక వెన్నునొప్పికి కారకం అవుతుంది. వెన్నునొప్పి(Back Pain), నడుము నొప్పిని తగ్గించడానికి ఈ ఆరోగ్య సూత్రాలను పాటించండి.

 

Also Read: Benefits Of Beetroot: సంతానోత్పత్తి కోసం చూస్తున్నారా, బీట్‌రూట్ వల్ల ప్రయోజనం కలుగుతుంది

రోగనిరోధక శక్తిని పెంచడానికి నిద్ర(Sleeping At Afternoon) చాలా అవసరం. కరోనా వైరస్ సమయంలో ఇది చాలా ముఖ్యమైనది. అయితే తక్కువ గంటలు నిద్రించడం వల్ల వెన్నునొప్పి లాంటి వాటిన పడే అవకాశాలు ఉన్నాయి. రోజుకు దాదాపు ఏడున్నర గంటల నుంచి 8 గంటల వరకు నిద్రిస్తే మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.

పని చేసేటప్పుడు సరిగ్గా కూర్చోవాలి. లేకపోతే నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మీరు మంచం మీద కూర్చుని పనిచేయడం మానేయండి. మీ వీపు గోడకు అనుకుని ఉండేలా చూసుకుని కూర్చుని పనిచేస్తే వెన్ను సమస్య తగ్గుతుంది. ఏ ఆధారం లేకుండా కూర్చుంటే మరిన్ని సమస్యలు వస్తాయి.

Also Read: Corona Vaccine: కరోనా విజేతలపై ఆసక్తికర విషయం, COVID-19 Vaccine ఒక్క డోసు ఇస్తే చాలు

పని మధ్యలో కాసేపు విరామం తీసుకుని మళ్లీ ప్రారంభించాలి. దీని వల్ల మీకు విశ్రాంతితో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మధ్యమధ్యలో లేచి అటుఇటూ నడవాలని(Benefits Of Walking) వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిటారుగా నిల్చుని ఉండే ఆసనాలు కూడా వేయాలి.

ఐస్ ప్యాక్ వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. వెన్నునొప్పి, నడుము నొప్పి ఉన్న చోట ఓ గుడ్డలో చుట్టిన ఐస్ ముక్కలతో కాసేపు తుడవాలి. వీలైతే మర్దన చేయడంతో ప్రయోజనం పొందవచ్చు. దీని ద్వారా కాస్త నొప్పి, బాధను తగ్గిస్తుంది. ఐస్ ప్యాక్‌తో తుడవటం ద్వారా కండరాల నొప్పి నుండి ఉపశమనం ఉంటుంది.

Also Read: Copper Health Benefits: రాగి కడియం ధరించే అలవాటు ఉందా, అయితే Copper Benefits తెలుసుకోండి

వెన్నునొప్పితో బాధ పడేవారు మసాజ్ ద్వారా ప్రయోజనాల్ని పొందుతారు. సున్నితంగా వీపు, నడుము భాగంలో మర్దన చేయించుకుంటే మీ నరాలు ఉత్తేజితమవుతాయి. అదే సమయంలో వీపు నొప్పి క్రమ క్రమంగా తగ్గుతుంది. దీని ద్వారా ఫలితం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More