Home> హెల్త్
Advertisement

Watermelon Calories: పుచ్చకాయ తినే వారు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకొండి..!!

Watermelon Calories: వేసవిలో శరీరానికి తాజాదనాన్ని ఇచ్చే వాటిల్లో పుచ్చకాయ ఒక్కటి. మొదటగా దీనిని ఈజిప్ట్, చైనా దేశాల్లో మాత్రమే పండించేవారు. పుచ్చకాయను 10వ శతాబ్దంలో చైనాలో పండించారు.

Watermelon Calories: పుచ్చకాయ తినే వారు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకొండి..!!

Watermelon Calories: వేసవిలో శరీరానికి తాజాదనాన్ని ఇచ్చే వాటిల్లో పుచ్చకాయ ఒక్కటి. మొదటగా దీనిని ఈజిప్ట్, చైనా దేశాల్లో మాత్రమే పండించేవారు. పుచ్చకాయను 10వ శతాబ్దంలో చైనాలో పండించారు. కనుక చైనాలో పుచ్చకాయను అధికంగా వినియోగిస్తారు. ఈ పండులో  92 శాతం నీరు,  8 శాతం చక్కెర ఉంటుంది. కావున శరీరాన్ని వేసవి కాలంలో రీప్రెష్‌గా ఉంచుతుంది. ఇందులో బీటా కెరోటిన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌లు అధికంగా ఉంటాయి. దీని వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు లభిస్తాయే తెలుసుకుందాం..

జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది:

పుచ్చకాయ తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఈ పండులో నీరు శాతం అధికంగా ఉంటుంది. పొట్టలో ఏవైనా సమస్యలు ఉంటే.. వేసవిలో ఖచ్చితంగా ఈ పండును తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బరువును తగ్గిస్తుంది:

ప్రస్తుతం మారుతున్న జీవశైలి కారణంగా చాలా మంది బరువు పెరిగి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో పుచ్చకాయను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి సహాయపడుతుంది. పుచ్చకాయలో ఎలెక్ట్రోలైట్స్, అమైనో యాసిడ్ సిట్రులిన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. కావున దీనిని వేసవిలో తినడం వల్ల శరీరానికి మంచి మేలు చేస్తుంది. 

ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారా..!:

ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారికి పుచ్చకాయ చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్.. ఆస్తమాను తగ్గించేందుకు సహాయపడుతుంది.

ఎముకలను బలంగా ఉంచుతుంది:

పుచ్చకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుంది.  ఇందులో ఉండే లైకోపీన్.. బోలు ఎముకల వ్యాధిని నివారించేందుకు తోడ్పడుతుంది. అంతే కారుండా ఇది ఎముక పగుళ్లను నివారిస్తుంది. 

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Lady Finger Benefits: ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో రక్త కొరతను తగ్గిస్తుంది.. మీరు కూడా తాగండి.!!

Also Read: onion hair growth tips: మీ జుట్టు రాలుతుందా..అయితే ఈ సమస్యకు ఉల్లిపాయతో చెక్ పెట్టండి..!!

 

Also Read: CNG Car Tips: వేసవిలో CNG వాహనదారులు కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Read More