Home> హెల్త్
Advertisement

Vitamin K Benefits: అనారోగ్య సమస్యలు రాకుండా చేసే విట‌మిన్ ఇదే..

Health Benefits Vitamin K: మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. పోషకకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్‌ కె తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

Vitamin K Benefits: అనారోగ్య సమస్యలు రాకుండా చేసే విట‌మిన్ ఇదే..

Health Benefits Vitamin K in Telugu: విటమిన్ కె మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన పోషకం. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యానికి చర్మ సౌందర్యానికి కూడా విటమిన్ కె తోడ్పడుతుంది. ఇందులో విటమిన్ K1 ఆకుపచ్చని కూరగాయల్లో సహజంగా లభించే రకం. విటమిన్‌ K2  బ్యాక్టీరియా  చేత ఉత్పత్తి అయ్యే రకం. విటమిన్ కె ఎక్కువగా ఉండే ఆహారాలు, విటమిన్ కె లోపం యొక్క లక్షణాలు తెలుసుకుందాం.

ఇక విటమిన్ కె యొక్క ప్రధాన ప్రయోజనాలు:

రక్తం గడ్డకట్టడం:

గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టేలా చేయడానికి విటమిన్ కె అవసరం.  శరీరంలోని కొన్ని ప్రోటీన్లు సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ కె అవసరం. 

ఎముకల ఆరోగ్యం:

ఎముకలు దృఢంగా ఉండేందుకు కాల్షియం (calsium) ముఖ్యమైనది. విటమిన్ కె కాల్షియం ఎముకల్లోకి చేరడానికి సహాయపడుతుంది. 

చర్మ సౌందర్యం:

విటమిన్ కె లోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ   గుణాలు వాపు తగ్గించడానికి మరియు గాయాలుపడేలా చేయడానికి సహాయపడతాయి. 

విటమిన్ కె ఎక్కువగా ఉండే ఆహారాలు:

ఆకుకూరలు  విటమిన్ కె యొక్క గొప్ప వనరులు.  పాలకూర,  తోటకూర, గోంగూర,  బచ్చలి వంటి ఆకుపచ్చని కూరగాయలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది.  

ఇతర ఆహారాలలో కూడా విటమిన్ కె లభిస్తుంది అవి:

* కొవ్వెక్కువ  ఉన్న చేపలు 

* గుడ్డు 

* అవకాడో 

* బ్రొకోలి 

 డాక్టర్ సలహా తీసుకోండి 

విటమిన్ కె మన ఆరోగ్యానికి ఎంతోوమైంది అయినప్పటికీ, డాక్టర్ సలహా లేకుండా విటమిన్ కె సప్లిమెంట్స్ తీసుకోకూడదు.  మీ ఆహారంలో పైన పేర్కొన్న ఆహారాలను చేర్చుకోవడం ద్వారా సాధారణంగా విటమిన్ కె లోపం రాదు.   విటమిన్‌ కె తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు కానీ విటమిన్‌ కె లోపంతో బాధపడుతే తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు తినే పదార్థాలలో విటమిన్‌ కె ఉండేలా చేసుకోవాలి. విటమిన్‌ కెలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పైన చెప్పిన పదార్థాలను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు విటమిన్‌ కె తీసుకోవడం చాలా అవసరం. 

గమనిక: ఇందులో ఇవ్వబడిన సమాచారం కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే.  ఇది వైద్య సలహా కాదు.  ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే డాక్టర్‌ను   సంప్రదించండి

Also Read: LPG Cylinder Price Hike: ఫస్ట్‌రోజే సామాన్యులకు బిగ్ షాక్! ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు.. నగరాలవారీగా ధరలు ఎలా ఉన్నాయంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More