Home> హెల్త్
Advertisement

Vitamin C Side Effects: విటమిన్ సి మోతాదు మించితే ప్రమాదకరమా, ఏ సమస్యలొస్తాయి

Vitamin C Side Effects: ఆరోగ్యం గురించి ఎప్పుుడు మాట్లాడుకున్నా విటమిన్ సి గుర్తొస్తుంది. మనిషి శరీరానికి అంత ముఖ్మమైంది ఇది. కరోనా మహమ్మారి సమయం నుంచి విటమిన్ సి ప్రాధాన్యత ప్రతి ఒక్కరికీ తెలిసివచ్చింది. అయితే విటమిన్ సి పరిమితి దాటితే మంచిది కాదా, ఎంతవరకూ నిజమనేది తెలుసుకుందాం..

Vitamin C Side Effects: విటమిన్ సి మోతాదు మించితే ప్రమాదకరమా, ఏ సమస్యలొస్తాయి

Vitamin C Side Effects: మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతాయి. ఇందులో అతి ముఖ్యమైంది విటమిన్ సి. శరీరంలో ఇమ్యూనిటీని పెంచేది ఇదే. అందుకే విటమిన్ సికు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది కదా అనే కారణంగా ఇష్టారాజ్యంగా వినియోగించవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు.

విటమిన్ సి అనేది కేవలం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ సంరక్షణ, హెయిర్ కేర్‌కు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఆరోగ్యానికి మంచిదనే కారణంగా ఇష్టారాజ్యంగా వాడకూడదు. ఎందుకంటే అవసరానికి మించి విటమిన్ సి శరీరాన్ని ప్రమాదకరంగా మారుతుంది. కిడ్నీ, ఎముకల సమస్యకు కారణమౌతుంది. అందుకే పరిమితంగానే విటమిన్ సి తీసుకోవాలి. విటమిన్ సి అవసరానికి మించి తీసుకోవడం వల్ల కొన్ని దుష్పరిణామాలు గమనించవచ్చు. మీక్కూడా ఈ లక్షణాలు కన్పిస్తే మీ శరీరంలో విటమిన్ సి మోతాదుకు మించి ఉందని అర్ధం. వెంటనే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను కొన్నిరోజులు దూరం పెట్టాలి.

విటమిన్ సి అవసరానికి మించి తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల బ్యాలెన్స్ తప్పుతుంది. ఫలితంగా విటమిన్ బి12, కాపర్ స్థాయి తగ్గిపోతుంది. మరోవైపు విటమిన్ సి ఎక్కువైతే మనిషి శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. విటమిన్ సి ఎక్కువైతే ముఖ్యంగా జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా  అజీర్తి, వాంతులు, కడుపు నొప్పి, ఛాతీలో మంట వంటి సమస్యలు కన్పిస్తాయి. విటమిన్ సి సప్లిమెంట్స్ ఆపేస్తే ఈ లక్షణాలు దూరం కావచ్చు.

అవసరానికి మించి విటమిన్ సి తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడవచ్చు. ఎందుకంటే అదనంగా ఉండే విటమిన్ సి శరీరాన్ని ఆక్సలేట్ రూపంలో యూరిన్ మార్గం నుంచి బయటకు పంపించేస్తుంది. కానీ చాలా సందర్భాల్లో ఇతర మినరల్స్‌తో కలిసి చిన్న చిన్న రాళ్లుగా ఏర్పడి ఉండిపోతాయి. శరీరంలో మోతాదుకు మించి విటమిన్ సి ఉండటం వల్ల ఎముకల్లో అసాధారణ గ్రోత్ అంటే బోన్ స్పర్ రావచ్చు. ఇది సాధారంగా కీళ్లలో వచ్చే సమస్య. ఈ సమస్య ఉంటే ఒక ఎముక విచిత్రంగా ఎదిగి బయటకు చొచ్చుకొస్తుంది. ఫలితంగా నొప్పి, బలహీనత వంటి లక్షణాలు రావచ్చు.

శరీరంలో విటమిన్ సి ఉత్పత్తి కాదు. అందుకే ఈ న్యూట్రియంట్ లోపం తలెత్తకుండా విటమిన్ సి ఆహారం లేదా సప్లిమెంట్ మెడిసిన్ తీసుకోవాలి. ఏ వయస్సులోవారు రోజుకు ఎంత మోతాదులో విటమిన్ సి తీసుకోవాలనేది సూచీ ఉంటుంది. దాని ప్రకారం  పాటిస్తే ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. 

Also read: Arthritis Impact: యువకుల్లో ఆర్ధరైటిస్ సమస్యకు కారణమేంటి, ఎలా విముక్తి పొందాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More