Home> హెల్త్
Advertisement

World Cancer Day: ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, ఈ లక్షణాల్ని అస్సలు విస్మరించకూడదు

World Cancer Day: క్యాన్సర్ రోగం కంటే ఆ రోగం కల్పించే భయమే మనిషిని కృంగదీస్తుంటుంది. క్యాన్సర్‌పై అవగాహన , సరైన చికిత్స కోసమే ప్రపంచ క్యాన్సర్ డే జరుపుకుంటున్నాం. ఇవాళ క్యాన్సర్ డే సందర్భంగా..ఏయే లక్షణాల్ని విస్మరించకూడదనేది తెలుసుకుందాం.
 

World Cancer Day: ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, ఈ లక్షణాల్ని అస్సలు విస్మరించకూడదు

World Cancer Day: క్యాన్సర్ రోగం కంటే ఆ రోగం కల్పించే భయమే మనిషిని కృంగదీస్తుంటుంది. క్యాన్సర్‌పై అవగాహన , సరైన చికిత్స కోసమే ప్రపంచ క్యాన్సర్ డే జరుపుకుంటున్నాం. ఇవాళ క్యాన్సర్ డే సందర్భంగా..ఏయే లక్షణాల్ని విస్మరించకూడదనేది తెలుసుకుందాం.

ప్రపంచ క్యాన్సర్ డే. ప్రతి యేటా ఫిబ్రవరి 4వ తేదీన జరుపుకుంటుంటాం. క్యాన్సర్ గురించి అవగాహన పెంచడం, నివారణ, సరైన సమయంలో గుర్తించడం, చికిత్స విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ డే (World Cancer Day) జరుపుకుంటాం. ఎందుకంటే క్యాన్సర్ రోగం కంటే..ఆ రోగం కల్పించే భయమే మనిషిని విపరీతంగా కృంగదీస్తుంటుంది. చక్కని ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తూ..మెరుగైన జీవనశైలి అలవర్చుకుంటే..ఏ భయమూ ఉండదు. దాంతో పాటు సరైన వైద్య చికిత్స అవసరం. అందుకే క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు ( Cancer Symptoms) సూచిస్తుంటారు.

ప్రతియేటా ప్రపంచంలో క్యాన్సర్ బారిన పడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్యాన్సర్ కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రారంభంలో క్యాన్సర్‌ను గుర్తించకపోవడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రారంభంలోనే క్యాన్సర్ లక్షణాల్ని గుర్తిస్తే..సరైన చికిత్స ద్వారా కోలుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా మహిళలు విస్మరించకూడని కొన్ని లక్షణాల్ని(Cancer Symptoms in Women) సూచించారు. అవేంటో చూద్దాం.

మహిళల్లో ప్రధానంగా కన్పించేది రొమ్ము క్యాన్సర్ (Breast Cancer). ఇది అత్యంత సాధారణమైంది. ప్రతి యేటా 2.1 మిలియన్ల మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. బ్రెస్ట్‌లో ఆకస్మిక మార్పులే దీనికి కారణం. ఎప్పటికీ ఈ మార్పుల్ని విస్మరించకూడదు. ఇది బ్రస్ట్ క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు. ఆ లక్షణాలు కన్పిస్తే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. అదే విధంగా రొమ్ము, చంకలో నొప్పిలేని గడ్డలు ఏర్పడతాయి. చర్మంపై మార్పులొస్తాయి. చనుమొనల్నించి రక్తస్రావం కలుగుతుంది. 

ఇక రెండవది ఎక్కువకాలం పాటు రక్తస్రావం జరగడం ఓ లక్షణం. అంటే ఓ వారం కంటే ఎక్కువ రోజులు రక్తస్రావం జరగడం మంచిది కాదు. గత సైకిల్స్‌తో పోలిస్తే ఎక్కువ రక్తస్రావం జరిగితే తక్షణం గైనకాలజిస్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఇక ఇర్రెగ్యులర్ రక్తస్రావం. లైంగిక సంపర్కం తరువాత రక్తస్రావం, పీరియడ్స్ ముగిసిన తరువాత బ్లీడింగ్, గర్భాశయ క్యాన్సర్‌కు సంకేతమే. వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక మెనోపాజ్ తరువాత బ్లీడింగ్ జరగడం లేదా పీరియడ్స్ ఆగిన ఏడాది పాటు జరగడం, గర్భాశయ క్యాన్సర్‌కు తొలి లక్షణంగా చెప్పుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ లక్షణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. పీరియడ్స్ సమయంలో పెయిన్స్, డిస్మెనోరియా, పీరియడ్స్ బాధాకరంగా ఉండటం కూడా లక్షణాలుగా ఉంటాయి. తరచూ రక్తస్రావం కూడా నొప్పికి కారణమవుతుంది. 

దుర్వాసన మరో లక్షణం. యోని ఇన్‌ఫెక్షన్ కారణంగా గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. దుర్వాసనతో కూడిన యోని ఉత్సర్ల క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇక ఉదర సమస్యలు కూడా మరో లక్షణమే. కడుపు ఉబ్బరంగా ఉండటం, బరువు క్షీణించడం వంటివి అండాశయ క్యాన్సర్‌కు లక్షణాలుగా చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే..ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (Harmone Replacement Therapy)వంటివాటి ద్వారా మహిళల్లో జననేంద్రియ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్యాన్సర్ లక్షణాల్ని ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. లేదంటే రిస్క్ ఎక్కువే.

Also read: ఓమిక్రాన్‌తో భయపడుతున్నారా.. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ ఆహారాన్ని తినిపించండి!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More