Home> హెల్త్
Advertisement

Belly Fat Reasons: బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు ఏంటో తెలుసా? వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి..

Sudden Belly Fat Reasons: ప్రస్తుతం చాలామంది బెల్లీ ఫ్యాట్ కారణంగా అంద హీనంగా తయారవుతున్నారు. ఇది రావడానికి ప్రధాన కారణాలు ముందుగానే గుర్తించి.. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు ఏంటో తెలుసా.?

Belly Fat Reasons: బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణాలు ఏంటో తెలుసా? వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి..

Sudden Belly Fat Reasons: ఆధునిక జీవనశైలి అనుసరించే ప్రతి ఒక్కరు ఊబకాయం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీరిలో చాలామంది బెల్లీ ఫ్యాట్ పెరగడం కారణంగా ఆందోళన చెందుతున్నారు. గంటల తరబడి కష్టపడి వ్యాయామాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అంతేకాకుండా చాలామంది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు డైట్లను కూడా అనుసరిస్తున్నారు. అయినప్పటికీ బెల్లీ ఫ్యాట్ ను నియంత్రించుకోలేకపోతున్నారు. బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తోంది. ఇది రావడానికి కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామందిలో బెల్లీ ఫ్యాట్ రావడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. కానీ కొందరిలో ఈ కింద పేర్కొన్న కారణాల వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ వస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ముందుగానే వీటిని గమనించి వెళ్లిన రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బెల్లీ ఫ్యాట్ రావడానికి ప్రధాన కారణాలు ఇవేనా?:
✽ చాలామంది ఆఫీసుల్లో బిజీ కారణంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

✽ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అందుబాటులోకి రావడం కారణంగా చాలామంది ఎక్కువ పడుకుని రీల్స్ ని స్క్రోల్  చేస్తున్నారు. దీని కారణంగా శరీరక శ్రమ మర్చిపోతున్నారు. 

✽ శారీరిక శ్రమ లేకపోవడం వల్ల కూడా చాలామందిలో బెల్లీ ఫ్యాట్ పెరుగుతోంది. ప్రతిరోజు వ్యాయామం చేసే వారిని పోల్చి చూస్తే.. వ్యాయామం చేయని వారిలో బెల్లీ ఫ్యాట్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

✽ ఆల్కహాల్ ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా శరీరంలో కేలరీలు పెరిగి బెల్లీ ఫ్యాట్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆల్కహాల్ సేవించే వారిలో బెల్లీ ఫ్యాట్ 80 శాతం పెరుగుతుందని నిపుణులు తెలిపారు.

✽ ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి చాలామందిలో ఒత్తిడికి గురి కావడం కారణంగా కూడా బెల్లీ ఫ్యాట్ వస్తోంది.

✽ ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర అనేది సమస్యగా మారింది. చాలామంది ప్రస్తుతం నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల కారణంగా కూడా బెల్లీ ఫ్యాట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More