Home> హెల్త్
Advertisement

Spices for Digestion: ఆహారం జీర్ణమవ్వడం లేదా? ఈ మసాల దినుసులను రోజు వాడండి చాలు!

Spices for Digestion: శీతాకాలంలో గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కొన్ని ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

Spices for Digestion: ఆహారం జీర్ణమవ్వడం లేదా? ఈ మసాల దినుసులను రోజు వాడండి చాలు!

Spices for Digestion: భారత్‌ వ్యాప్తంగా పండగ సీజన్‌ ప్రారంభమైంది. దీపావళి పండగ హిందువులకు అతి ముఖ్యమైన పండగ..కాబట్టి ఇలాంటి సమయంలో చాలా మంది ఇంట్లోనే తయారు చేసిన స్వీట్స్‌, డ్రిక్స్‌ ఎక్కువగా తీసుకుంటారు. శీతాకాలం కారణంగా ఆయిల్‌ అతిగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగించే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి సమస్య బారిన పడకుండా ఉండడానికి ఈ పండగ సీజన్‌లో ఆహారాల్లో ఈ కింది మసాల దినుసులు వినియోగించాల్సి ఉంటుంది.

జీలకర్ర:
పండగ సీజన్‌లో అనారోగకరమైన ఫుడ్స్‌ తిసుకునేవారు తప్పకుండా ఉదయం తీసుకునే ఆహారాల్లో జీలకర్రను ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా యాంటీ డయాబెటిక్‌గా కూడా పని చేస్తుంది. తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు జీలకర్రతో తయారు చేసిన నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.

అల్లం:
జీర్ణ సమస్యల నుంచి అల్లం సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ అల్సర్ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి శీతాకాలంలో అల్లంతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

సోంపు:
సోంపులో కూడా ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి సోంపుతో తయారు చేసిన నీటిని ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు శరీర బరువును కూడా నియంత్రిస్తుంది. కాబట్టి జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా సోంపును ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 

దాల్చిన చెక్క:
ఆహారాల రుచిని పెంచేందుకు దాల్చిన చెక్క ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలను తగ్గించేందుకు కూడా కృషి చేస్తాయి. పొట్ట ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు దాల్చిన చెక్క టీని తీసుకోవాల్సి ఉంటుంది. 

ఏలకులు టీ:
ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపేడేవారికి కూడా ఈ ఏలకుల టీ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా శీతాకాలంలో పొట్ట సమస్యలతో బాధపడేవారు ఈ టీని తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More