Home> హెల్త్
Advertisement

Soaked Cashew: నానబెట్టిన జీడిపప్పుతో బీపితో మధుమేహానికి కూడా చెక్‌!

Soaked Cashew For High Blood Pressure: ప్రస్తుతం చాలా మందిలో చలి కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు నానబెట్టిన జీడిపప్పును తీసుకోవాల్సి ఉంటుంది. 

 Soaked Cashew: నానబెట్టిన జీడిపప్పుతో బీపితో మధుమేహానికి కూడా చెక్‌!

 

Soaked Cashew For High Blood Pressure: చలికాలంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గి అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శీతాకాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీని కారణంగా సీజనల్‌ వ్యాధుల బారిన కూడా పడతున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

చలికాలంలో శరీరం చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజు జీడిపప్పును తీసుకోవడం వల్ల బాడీకి చాలా రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాఉల అన్ని రకాల తీవ్ర వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో నానబెట్టిన జీడిపప్పును తీసుకోవడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయి. 

శరీర శక్తిని పెంచుతుంది, బీపీ నియంత్రిస్తుంది:
జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. దీని శరీర శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు అధిక రక్తపోటును కూడా సులభంగా నియంత్రిస్తాయి. 

రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి:
మధుమేహంతో బాధపడేవారు శీతాకాలంలో ప్రతి రోజు నీటిలో నానబెట్టిన జీడిపప్పును తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్‌ కంటెంట్‌ కూడా అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉండడమే కాకుండా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. 

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
ప్రస్తుతం చాలా మంది చలి కారణంగా జీర్ణక్రియ సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు. నానబెట్టిన జీడిపప్పు తినడం జీర్ణక్రియకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి. దీంతో పాటు జీడిపప్పులో ఫైటిక్ యాసిడ్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడ వల్ల అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.  

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
చలి కాలంలో చాలా మందిలో రోగనిరోధక వ్యవస్థ తరచుగా బలహీనపడుతుంది. దీని కారణంగా అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు నానబెట్టిన జీడిపప్పును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో జింక్ శరీరానికి చాలా ఉపయోగపడుతుంది.

చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది:
శీతాకాలంలో చల్లని గాలుల కారణంగా చర్మంలోని తేమలో మార్పులు వచ్చి అనేక చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి రోజు నానబెట్టిన జీడిపప్పును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు, విటమిన్ ఇ, కె చర్మానికి సంబంధించిన అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More