Home> హెల్త్
Advertisement

Beauty Tips: శరీరంలో ఏ విటమిన్లు లోపిస్తే..మచ్చలు, పింపుల్స్ ఏర్పడుతాయి.

Beauty Tips: శరీరంలో విటమిన్ల లోపం కారణంగా ముఖంపై వివిధ రకాల మచ్చలు ఏర్పడుతుంటాయి. ఏ విధమైన విటమిన్లు లోపిస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయో చూద్దాం.

Beauty Tips: శరీరంలో ఏ విటమిన్లు లోపిస్తే..మచ్చలు, పింపుల్స్ ఏర్పడుతాయి.

అందం సగం ఆరోగ్యమంటారు. కానీ ముఖంపై ఏర్పడే వివిధ రకాల మచ్చలతో అంద వికారంగా తయారవుతుంటారు. బాహ్యంగా జరిగే కారణాలే కాకుండా శరీరంలో అంతర్గతంగా తలెత్తే లోపాలతో కూడా ఇలా జరుగుతుంటుంది. ఆ వివరాలు మీ కోసం..

శరీరంలో విటమిన్లు, పోషకాల లోపంతో వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా విటమిన్ల లోపంతో ముఖంపై అవాంఛిత మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి పోవాలంటే ముందు విటమిన్ లోపం ఉండకూడదు. విటమిన్ సి అనేది చర్మానికి ప్రయోజనకరం. విటమిన్ సి కొలాజెన్ ఉత్పత్తిలో దోహదపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటే ఏ విధమైన మచ్చలు ఏర్పడవు.  విటమిన్ సి కొరత పూర్తి చేసేందుకు ఆరెంజెస్, బత్తాయి, ఉసిరి, నిమ్మకాయ, జాంకాయ తింటే మెరుగైన ఫలితాలుంటాయి.

ముఖంపై మచ్చలకు విటమిన్ డి లోపం కూడా కారణం. ఈ సమస్యను దూరం చేయాలంటే..పాల ఉత్పత్తులు చాలా కీలకం.  గుడ్లు, చేపలు, మాంసం తినడం ద్వారా విటమిన్ డి లోపం పూర్తి చేయవచ్చు. చర్మాన్ని నిగనిగలాడేలా చేయాలంటే పాల ఉత్పత్తుల్ని తప్పకుండా సేవించాల్సి ఉంటుంది. 

విటమిన్ బి 12 లోపం కారణంగా పిగ్మంటేషన్ సమస్య ఏర్పడుతుంది. విటమిన్ బి 12 లోపంతో ముఖంపై వివిధ రకాల మచ్చలు ఏర్పడుతాయి. వీటీని దూరం చేసేందుకు డైట్‌లో పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు, ఆకుపచ్చని కూరగాయలు తినాల్సి ఉంటుంది. 

మెలానిన్ అనేది చర్మం రంగుకు కారకం. శరీరంలో మెలానిన్ ఎక్కువైతే చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. విటిమిన్ ఇ పుష్కలంగా ఉండే పదార్ధాలు తీసుకుంటే ఈ లోపం అరికట్టవచ్చు.

Also read: Constipation: చిటికెలో వీటిని ఉపయోగించి మలబద్ధకం సమస్యల నుంచి ఇలా ఉపశమనం పొందండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More