Home> హెల్త్
Advertisement

Cholesterol Tips: మందుల్లేకుండా కొలెస్ట్రాల్ తగ్గించడం ఎలా, సులభమైన చిట్కాలు ఇవే

Cholesterol Tips: హై కొలెస్ట్రాల్, బ్లెడ్ కొలెస్ట్రాల్ రెండూ అత్యంత ప్రమాదకరం. హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్‌కు దారి తీస్తాయి. ఒకసారి సమస్య వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. కొన్ని పద్ధతులు పాటిస్తే మాత్రం మందుల అవసరం లేకుండానే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..
 

Cholesterol Tips: మందుల్లేకుండా కొలెస్ట్రాల్ తగ్గించడం ఎలా, సులభమైన చిట్కాలు ఇవే

Cholesterol Tips: హై కొలెస్ట్రాల్, బ్లెడ్ కొలెస్ట్రాల్ రెండూ అత్యంత ప్రమాదకరం. హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్‌కు దారి తీస్తాయి. ఒకసారి సమస్య వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే. కొన్ని పద్ధతులు పాటిస్తే మాత్రం మందుల అవసరం లేకుండానే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు..

ఆధునిక జీవనశైలిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ప్రధానమైంది హై కొలెస్ట్రాల్. సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమే కానీ నిర్ణీత మోతాదు దాటకూడదు. అది కూడా రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ స్థూలంగా హెచ్‌డీఎల్. రక్త సరఫరా, రక్త వాహికల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. అటు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్ స్థూలంగా ఎల్‌డీఎల్‌గా పిలుస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది రక్త వాహికల్లో పేరుకుపోతుంటుంది. ఫలితంగా బ్లడ్ ఫో తగ్గిపోతుంది లేదా మొత్తానికి ఆగిపోతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు ఎదురౌతాయి. గుండెకు రక్తాన్ని, ఆక్సిజన్‌ను చేర్చే రక్త వాహికల్ని ఎల్‌డీఎల్ బ్లాక్ చేస్తుంటుంది. 

మందుల్లేకుండా కొలెస్ట్రాల్ నియంత్రణ ఎలా

మీకు శారీరకంగా ఏదైనా సమస్య ఎదురైతే ముందుగా కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోండి. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే..తక్షణం వైద్యుడిని సంప్రదించాలి. కొన్ని విషయాల్లో మందుల్లేకుండా సహజసిద్ధమైన పద్ధతులతోనే కొలెస్ట్రాల్ దూరం చేయవచ్చు. నేచురల్ పద్దతుల్లో కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవచ్చేనేది పరిశీలిద్దాం.

కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ముందుగా చేయాల్సింది బరువు తగ్గించడం. ముందుగా స్థూలకాయం తగ్గించే పనిలో ఉండాలి. ముఖ్యంగా కడుపు, నడుముకు అటూ ఇటూ ఉండే కొవ్వు ఉంటే విసరల్ ఫ్యాట్ పెరుగుతుంది. ఇది లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. పసుపు డైట్‌తో చాలా త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మద్యపానం మానేయాలి. మద్యం అధిక మోతాదులో తీసుకుంటే..శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. 

ఇక మూడవది సిగరెట్ స్మోకింగ్. స్మోకింగ్ కారణంగా హార్ట్ ఎటాక్, హార్ట్‌రేట్ సమస్యలు ఎదురౌతాయి. స్మోకింగ్ మానేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్, లంగ్ ఇన్‌ఫెక్షన్ మెరుగుపడి..హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మరో ముఖ్యమైన విధానం వ్యాయామం. దీనికోసం మీరు మీ దైనందిక జీవితంలో ఫిజికల్ యాక్టివిటీని బాగా పెంచాలి. స్విమ్మింగ్, వాకింగ్, సైక్లింగ్, డ్యాన్స్ ఇలా ఏదైనా చేయవచ్చు. ఎక్కువసేపు కూర్చుని ఉండకూడదు. ప్రతి అరగంటకోసారి లేచి..అటూ ఇటూ నడవాలి. ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే శరీరంలో హెచ్‌‌డీఎల్ స్థాయి పెరుగుతుంది. 

ఇక చివరిగా పసుపు డైట్ అనేది తప్పనిసరి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఈ పద్ధతి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముందుగా ప్రోసెస్డ్ ఫుడ్, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. ఓట్‌మీల్, కిడ్నీ బీన్స్, యాపిల్, స్ప్రౌట్స్ అనేవి తరచూ తీసుకుంటే బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్‌నట్స్, ఫ్లెక్స్ సీడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. 

Also read: Cholesterol Control Tips: ధనియాలు, ఉసిరితో కూడా చెడు కొలెస్ట్రాల్‌ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More