Home> హెల్త్
Advertisement

Cashew Nuts Side Effects: ఈ అనారోగ్యాలతో బాధపడేవారు జీడిపప్పు తినకపోవడమే మంచిది!

Cashew Nuts Side Effects: ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పు ఖాళీ కడుపుతో తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అనారోగ్యంతో బాధపడేవారు జీడిపప్పు తినకూడదు? జీడిపప్పు తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసుకోండి!

Cashew Nuts Side Effects: ఈ అనారోగ్యాలతో బాధపడేవారు జీడిపప్పు తినకపోవడమే మంచిది!

Cashew Nuts Side Effects: జీడిపప్పు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది భావిస్తారు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, జింక్, ఐరన్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 

జీడిపప్పులో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జీడిపప్పుకు దూరంగా ఉంటే మంచిదని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో జీడిపప్పు ఎక్కువగా తింటే జీడిపప్పు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇంతకీ ఏ అనారోగ్యంతో బాధపడేవారు జీడిపప్పు తినకూడదు? జీడిపప్పు తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసుకుందాం. 

రక్తపోటు (హెవీ బ్లడ్ ప్రషర్)
జీడిపప్పులో సోడియం ఎక్కువగా ఉండడం వల్ల.. దీన్ని మీరు ఎక్కువగా తీసుకుంటే, శరీరంలో సోడియం స్థాయిలు పెరుగుతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో సోడియం స్థాయిలను పెరగడం వల్ల.. రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. 

ఎసిడిటీ లేదా గ్యాస్ సమస్యలు
జీడిపప్పులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఖాళీ కడుపుతో అధికంగా జీడిపప్పు తినడం వల్ల శరీరంలో ఫైబర్ పరిమాణం పెరుగుతుంది. దీంతో ఎసిడిటీ లేదా గ్యాస్‌ సమస్యలు తలెత్తుతాయి

కిడ్నీ వ్యాధిగ్రస్తులు
పొటాషియంలో జీడిపప్పు దుష్ప్రభావాలు ఉన్నాయి. అందువల్ల, మీకు కిడ్నీ సమస్యలు ఉంటే, శరీరంలో పొటాషియం స్థాయిలను పెంచడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడే వారు జీడిపప్పు ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది.

ఆరోగ్యవంతమైన వ్యక్తి సాధారణంగా రోజుకు 4 నుంచి 5 జీడిపప్పులను తినవచ్చు. కానీ మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే నిపుణుల సలహా మేరకు జీడిపప్పు తీసుకోవడం చాలా మంచిది. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారాన్ని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవడం ఉత్తమ. ZEE మీడియా దీన్ని ధ్రువీకరించలేదు. 

Also Read: Mysterious Death Alert: ఒమిక్రాన్‌కు తోడుగా అంతుచిక్కని భయంకర వ్యాధి ముప్పు, పదుల సంఖ్యలో మరణాలు

Also Read: Pfizer Medicine on Omicron: గుడ్‌న్యూస్, ఒమిక్రాన్‌పై అద్బుతంగా పనిచేస్తున్న ఫైజర్ కొత్త మందు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More