Home> హెల్త్
Advertisement

Side Effects of Eating Pears: వీళ్లు కానీ బేరిపండు తిన్నారో.. ఇక అంతే సంగతి !!

Side Effects of Eating Pears: ఎన్నో సద్గుణాలు ఉన్న బేరి పండును ఎవరుపడితే వారు తినడానికి మాత్రం సూట్ కాదు. ఎందుకంటే కొంతమందికి ఇవి తింటే లాభాలకు బదులు నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అదేంటో తెలియాలంటే మనం ఇంకొన్ని డీటేల్స్ లోకి వెళ్లాల్సిందే.

Side Effects of Eating Pears: వీళ్లు కానీ బేరిపండు తిన్నారో.. ఇక అంతే సంగతి !!

Side Effects of Eating Pears: పియర్స్ ఫ్రూట్.. దీనినే తెలుగులో బేరి పండు అని కూడా పిలుస్తారు. ఈ బేరి పండుతో ఆరోగ్యానికి ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్స్, మినెరల్స్, ఫైబర్.. ఇలా గుండెకు మేలు చేసే పోషకాలతో పాటు క్యాన్సర్ వ్యాధితో పోరాడే గుణాలు కూడా ఈ బేరి పండు సొంతం. అంతేకాకుండా అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి డైట్. శరీరంలో మంటని తగ్గిస్తుంది. ఇన్ని సద్గుణాలు ఉన్న బేరి పండును ఎవరుపడితే వారు తినడానికి మాత్రం సూట్ కాదు. ఎందుకంటే కొంతమందికి ఇవి తింటే లాభాలకు బదులు నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అదేంటో తెలియాలంటే మనం ఇంకొన్ని డీటేల్స్ లోకి వెళ్లాల్సిందే.

ఎవరెవరు ఈ బేరి పండు తినకూడదంటే..
జలుబు, దగ్గు, జ్వరం :
జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవాళ్లు ఈ పీయర్స్ పండు తినకూడదు. ఎందుకంటే.. పీయర్స్ పండు సాధారణంగానే చలువ చేస్తుంది. అలాంటిది ముందే జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు ఈ బేరి పండు తింటే ఆ సమస్య ఇంకా ఎక్కువై ఇంకా ఎక్కువ అవస్తలు పడే ప్రమాదం ఉంది.

జీర్ణ సంబంధిత సమస్యలు : 
కొంతమంది అజీర్తి సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి వారు పీయర్స్ ఫ్రూట్ తింటే.. అది వారిపై లాభాల స్థానంలో దుష్ప్రభావాలే ఎక్కువగా కనిపిస్తాయి. బేరి పండు తినడం వల్ల జీర్ణ శక్తి తగ్గుతుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఆ బేరి పండును అరిగించుకోవడం కోసం మరింత శ్రమపడాల్సి వస్తుంది. ఫలితంగా కడుపులో నొప్పి, ఉబ్బరం, కొన్నిసార్లు విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

హై బ్లడ్ ప్రెషర్ : 
ఈ బేరి పండు ఒక పరిమితిలో తింటేనే దాని ఆరోగ్య ప్రయోజనాలు వర్తిస్తాయి. మోతాదుకు మించి తింటే సమస్యలే వస్తాయి. అందులోనూ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారు ఎక్కువ మోతాదులో బేరి పండ్లు తింటే అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. గుండె వేగం పెరగడం, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. 

ఎలర్జి సమస్య.. :
కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు లేదా పండ్లు, కూరగాయలు తిన్నప్పుడు శరీరంలో దురద వస్తుంది. అంటే వారికి ఆ ఫుడ్ తింటే ఎలర్జి వస్తుందని అర్థం. దీనినే ఫుడ్ ఎలర్జీ అని కూడా అంటుంటారు. అలాగే ఈ పీయర్స్ పండు తింటే కూడా కొంతమందికి ఎలర్జీ సమస్య వస్తుంది. అలాంటి వారు ఈ పీయర్స్ పండ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే పొరపాటున కూడా మర్చిపోయి బేరిపండు తిన్నారో.. ముఖంపై, మెడపై దద్దుర్లు వచ్చి దురద వస్తుంది. ఈ ఎలర్జి సమస్య కొన్నిసార్లు తీవ్రంగా ఉంటుంది. అందుకే ఇవి తింటే పడని వారు వీటికి దూరంగా ఉండటమే మేలు అనే విషయం మర్చిపోవద్దు.

ఇది కూడా చదవండి : Calcium Rich Foods: క్యాల్షియం లోపంతో వచ్చే ఆరోగ్య సమస్యలు.. క్యాల్షియం అధిక మోతాదులో ఉండే ఫుడ్స్

అధిక బరువు తగ్గించుకునే వారు : 
అధిక బరువు తగ్గించుకునే వారు ఈ పీయర్స్ పండ్లు తింటుంటారు. ఎందుకంటే వీటిలో కేలరీలో తక్కువగా ఉంటాయని. అయితే, అధిక బరువు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న వాళ్లు కొంతమంది తక్కువ కేలరీలు ఉన్న పండ్లు కదా అని బేరి పండ్లు ఎక్కువగా తింటుంటారు. సరిగ్గా అక్కడే వారు పొరపాటు చేసిన వాళ్లు అవుతారు. ఎక్కువ మొత్తంలో బేరి పండ్లు తినడం వల్ల అధిక మొత్తంలో కేలరీలు ఒంట్లోకి చేరి మరింత లావెక్కే ప్రమాదం ఉంది. ఇది కూడా చదవండి : 
Uric Acids Patients: యూరిక్ యాసిడ్ పేషెంట్స్ ఇవి తింటే ఇక నొప్పులే ఉండవు

(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించడానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More