Home> హెల్త్
Advertisement

ఔషధ గని.. గుమ్మడి గింజలు

ఔషధ గని.. గుమ్మడి గింజలు

ఇది గుమ్మడికాయల సీజన్. చాలా మంది గుమ్మడి కాయ గుజ్జు ఉంచుకొని గింజల్ని పక్కన పారేస్తుంటారు. అవునా? అయితే మీకు ఆ గింజల రహస్యం తెలియదనుకుంటా. వాటిలో ఉన్న పోషక విలువలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. అసలు మీరు ఆ గుమ్మడి గింజల రహస్యం తెలిస్తే మరోసారి ఆ పని చేయరు గాక చేయరు. 

* గుమ్మడి గింజల్లో మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, పాస్పరస్, జింక్, ఐరన్ .. లాంటి ఎన్నో ఖనిజాలతో పాటు ప్రోటీన్లు, ఎ, బి విటమిన్లు లభ్యమవుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

* ఇందులో ఉండే ఫినాలిక్ పదార్ధం క్యాన్సర్ ను అడ్డుకుంటుంది. జీవక్రియను పెంచుతుంది. 

* మంచిగా నిద్ర పట్టాలంటే గుమ్మడి గింజలు తినాల్సిందే. 

* శరీరంలో టాక్సిన్లను తొలగిస్తుంది. కిడ్నీలో రాళ్లు పెరగకుండా ఆపుతుంది. 

* ఎముక సాంద్రతను పెంచి, ఎముకల గట్టిదనానికి దోహదపడుతుంది. 

* కొవ్వు  శాతాన్ని తగ్గిస్తుంది, రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చూస్తుంది.

*  గుమ్మడికాయ గింజలు తింటే గుండె జబ్బులు, పక్షవాతము రావు. 

* గుమ్మడి గింజల్లో కాపర్ శాతం అధికం. ఇవి ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతుంది. సోడియం శాతం తగ్గి బీపీ కంట్రోల్ లో వస్తుంది. 

గమనిక: గుమ్మడి గింజల్లో క్యాలరీల శాతం ఎక్కువ. కాబట్టి ఊబకాయులు వీటిని తిన్నప్పుడు ఇతర క్యాలరీలను తగ్గించుకోవాలి. 

Read More