Home> హెల్త్
Advertisement

Salt Water Bath: చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేయండి చాలు..అన్ని నొప్పులు దూరం, స్ట్రెస్ నుంచి విముక్తి

Salt Water Bath: నిత్యం వివిధ రకాల బాడీ పెయిన్స్‌తో సతమతమవుతుంటాం. ముఖ్యంగా మోకాలి నొప్పి సర్వ సాధారణంగా మారిపోతుంది. అందుకే రోజూ స్నానం చేసేటప్పుడు కొద్దిగా అది కలుపుకుంటే మంచి ఫలితాలుంటాయి..

Salt Water Bath: చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేయండి చాలు..అన్ని నొప్పులు దూరం, స్ట్రెస్ నుంచి విముక్తి

Salt Water Bath: నిత్యం వివిధ రకాల బాడీ పెయిన్స్‌తో సతమతమవుతుంటాం. ముఖ్యంగా మోకాలి నొప్పి సర్వ సాధారణంగా మారిపోతుంది. అందుకే రోజూ స్నానం చేసేటప్పుడు కొద్దిగా అది కలుపుకుంటే మంచి ఫలితాలుంటాయి..

వేడి నీళ్లు లేదా చల్లటి నీళ్లు రెండూ మంచివి కావు. గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అదే సమయంలో స్నానం చేసేటప్పుడు కొద్దిగా అందులో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే చాలా రకాల సమస్యలు దూరమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల ముఖ్యంగా మోకాళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా..ఒత్తిడి లేదా ఆందోళన కూడా తగ్గుతుంది. ఉప్పు నీటితో స్నానం వల్ల కలిగే ఇతర అనేక లాభాలేంటో చూద్దాం..

నీళ్లలో కొద్దిగా ఉప్పు కలుపుకుని స్నానం చేయడం అలవాటు చేసుకుంటే మోకాళ్ల నొప్పులకు పరిష్కారం లభిస్తుంది. కొద్దిపాటి ఉప్పుతో ఎముకల్లో తరచూ తలెత్తే చిన్నపాటి నొప్పులు కూడా మాయమవుతాయి. అంతేకాదు..కాళ్ల నొప్పులకు కూడా ఇది మంచి ప్రత్యామ్నాయం. ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీళ్లతో కాళ్లు కడుక్కున్నా..కాళ్ల నొప్పి తగ్గుతుంది. 

బయట తిరుగుతున్నప్పుడు వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు మన శరీరానికి సోకే ప్రమాదం లేకపోలేదు. అందుకే ప్రతిరోజూ కొద్దిగా ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే చాలా ప్రయోజనకరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని అన్ని రంధ్రాలు తెర్చుకుని..ఇన్ ఫెక్షన్ ముప్పు తగ్గిపోతుంది. ఉప్పు నీటితో స్నానం అలవాటు చేసుకుంటే..చర్మ రంధ్రాలు పూర్తిగా తెర్చుకుంటాయి. దాంతో శరీరంలోని మలినం బయటకు పోతుంది. శరీరం డీటాక్స్ అవడంతో ముఖంపై మరకలు, మచ్చలు, పింపుల్స్ సమస్య ఉండదు. చర్మం హైడ్రేట్ అవుతుంది. 

ఒత్తిడి ఎలా తగ్గుతుంది

ఆధునిక పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో ఆందోళన, ఒత్తిడి ఉంటుంటుంది. ఈ పరిస్థితుల్లో ఉప్పు కొద్దిగా కలిపిన నీళ్లతో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనముంటుంది. ఉప్పు నీటిలో ఉండే మినరల్స్ మన బాడీ గ్రహించుకుంటుంది. సోడియం ప్రభావం మెదడుపై పడటం, శరీరమంతా డీటాక్స్ అవడం వల్ల..స్ట్రెస్ పూర్తిగా తగ్గిపోతుంది. 

Also read: High Blood Pressure: బీపీని నిర్లక్ష్యం చేస్తే కంటి చూపే పోతుంది జాగ్రత్త

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More